పవర్ స్టార్ టార్గెట్ పూర్తి అవ్వడంతో ఉదయ్ కిరణ్ వైపు దృష్టిపెట్టిన వర్మ ?

Seetha Sailaja

ఎవరు ఏమనుకున్నా మరిన్ని విమర్శలు వచ్చినా వర్మ తాను అనుకున్నది చేసి తీరుతాడు అన్నవిషయం ‘పవర్ స్టార్’ మూవీతో తేలింది. ఈమూవీ గురించి వచ్చిన వివాదాలను పక్కకు పెడితే వర్మ ధైర్యం గురించి ఎవరైనా ఆశ్చర్యపడతారు.


‘పవర్ స్టార్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ‘మీకేమైనా ప్రాణభయం ఉందా..? మీకేమైనా సెక్యూరిటీ కావాలా’ అని ప్రశ్నించినప్పుడు వర్మ సమాధానం ఇస్తూ తాను 1997లో ‘కంపెనీ’ అనే సినిమాలో డైరెక్ట్ గా అండర్ వరల్డ్ డాన్స్ దావూద్ ఇబ్రహీం ఛోటా రాజన్ పేర్లు పెట్టి తీసాను అని చెపుతూ తాను వాళ్ళకే భయపడంది మరెవ్వరికి భయపడతాను అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో వర్మ తన భవిష్యత్ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతూ తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కొందరి బయోపీక్ లను తీసే ఆలోచనలు చేస్తున్నాను అంటూ లీకులు ఇచ్చాడు.


ఈమాటలు అన్న కొన్ని గంటలకే వర్మ తీయబోతున్నది ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటూ మరికొందరు గాసిప్పులు పుట్టిస్తున్నారు. దీనితో రామ్ గోపాల్ వర్మ యధాలోపంగా ఆ కామెంట్స్ చేసాడా లేకుంటే నిజంగానే ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసే సాహసం చేయగలడా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. వాస్తవానికి లేటెస్ట్ గా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో అప్పట్లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కూడ అలాంటి సంచలనమే సృష్టించింది. దీనికితోడు ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తీసే ఆలోచన ఒకప్పుడు దర్శకుడు తేజా చేసి కొన్ని ఒత్తుదులు వల్ల వెనక్కు వెళ్ళిపోయాడు.


దీనితో వర్మ తీయబోయే బయోపిక్ ఉదయ్ కిరణ్ దా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ‘ఆ రాత్రి ఏమైంది’ మూవీ గురించి ఆలోచనలు చేస్తున్న వర్మ ఇప్పుడు ఇలా బయోపిక్ ల గురించి ఆలోచనలు చేస్తూ ఉండటంతో అది ఉదయ్ కిరణ్ అని అనుకోవాలా లేదంటే లేటెస్ట్ సంచలనం సుశాంత్ సింగ్ అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: