స్మార్ట్ ప్రపంచంలోకి రాజమౌళి !
మార్కెట్ లెక్కల్లో తనను మించినోళ్లు లేరని మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు రాజమౌళి. ఆడియన్స్ పల్స్ ను క్యాచ్ చేయడంలో తాను మాస్టర్ అని రిపీట్ చేస్తున్నాడు జక్కన్న. ఆడియన్స్ కోరుకుంటున్న కంటెంట్ ను అందించేందుకు స్మార్ట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు రాజమౌళి.
రాజమౌళి ప్రేక్షకులను మాయ చేయడంలో ముందుంటాడు. ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. అందుకే జక్కన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. ఈ ఎమోషన్ టచ్ కే నార్త్ ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. రాజన్న సిినిమాలు కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు వెబ్ సిరీసుల వైపు వెళ్తున్నాడు.
లాక్ డౌన్ తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ఆడియన్స్ పెరిగిపోయారు. వరల్డ్ కంటెంట్ కు అలవాటు పడ్డారు. మహేశ్ బాబు, నాగచైతన్య లాంటి హీరోలు కూడా వెబ్ సిరీసులతోనే టైమ్ పాస్ చేస్తున్నారు. క్వారంటైన్ లో ఫలానా సిరీసులు చూశామని పోస్టులు పెడుతున్నారు. ఈ కేటగిరి ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వెబ్ సిరీసులు నిర్మించాలనుకుంటున్నాడు రాజమౌళి.
రాజమౌళి ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్. పోస్టర్ మీద జక్కన్న పేరు ఉంటే వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలాంటి దర్శకుడు వెబ్, సిరీసుల నిర్మాణం వైపు రావడం కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే ట్రేడ్ పండిట్స్ మాత్రం ఇది ఊహించిందే అంటున్నారు. ఆడియన్స్ ఇప్పుడు వెబ్ సిరీసులు చూస్తున్నారు. అలాగే లాక్ డౌన్ తో రాజమౌళికి బోల్డంత ఫ్రీ టైమ్ దొరికింది. ఈ టైమ్ ని ఇలా వాడాలనుకుంటున్నాడట జక్కన్న. మొత్తానికి దర్శక ధీరుడు రాజమౌళి ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి దిగుతున్నాడు. వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు చాలా ప్లాన్సే వేస్తున్నాడు. లాక్ డౌన్ దెబ్బకు వెబ్ సిరీస్ లకు అడిక్ట్ అయిన యూత్ ను అట్రాక్ట్ చేసుకునే పనిలో ఉన్నాడు రాజమౌళి.