ఎవరూ చేయని సాహసం చేసిన నిత్య..!
బాలీవుడ్ లో పాగా వేయాలంటే సౌత్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలి. లేదంటే.. లక్కీ హీరోయిన్ ముద్ర పడాలి. ఈ రెండు లేకపోతే.. హిందీ వాళ్ల దృష్టి సౌత్ ముద్దుగుమ్మలపై పడవు. స్టార్ డమ్.. సక్సెస్ ఫుల్ ముద్ర లేకుండానే.. హిందీలో పాతుకు పోవాలని ఇద్దరు స్టార్ హీరోయిన్స్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఏ హీరోయిన్ చేయని సాహసం చేసి లెస్బియన్ గా మారారు.
రెజీనా, నిత్య బాలీవుడ్ లో అధృష్టం పరీక్షించుకుంటున్నారు. నిత్యమీనన్ టాలీవుడ్ కెరీర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ తో మొదలైంది. గ్లామర్ అనే మాట ఈ అమ్మడి ఒంటికి అసలు పడదు. స్టార్ ఇమేజ్ దక్కకపోయినా.. మంచి పెర్ఫామర్ అన్న పేరైతే తెచ్చుకుంది. అయితే.. హైట్ తక్కువ కావడం ఈ అమ్మడి కెరీర్ కు బ్రేకులేసింది. బన్నీ.. ఎన్టీఆర్ సినిమాలు సన్నాఫ్ సత్యమూర్తి.. జనతా గ్యారేజ్ లో నటించినా.. ప్రాధాన్యమున్న పాత్రలు దక్కలేదు.
తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో హిందీలో నటించిన మిషన్ మంగళ్ తో అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకొని.. బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కించుకుంది నిత్య. ఇందులో లెజ్బియన్ గా నటించిన సౌత్ ఇండియన్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ హీరోయిన్ నిత్య ఏంటి.. ఇలాంటి రోల్ ప్లే చేయడమేంటని ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. నిత్య లిప్ లాక్ విజువల్స్ నెట్ లో వైరల్ అయ్యాయి. లెస్బియన్ ను చంపేందుకు నిత్య లెస్బియన్ గా యాక్ట్ చేసింది. పాత్ర ఎలాంటిదైనా.. నిత్య రోల్ కు బాలీవుడ్ ఫిదా అయింది.
నిత్య మీనన్ లెస్బియన్ గా నటించడం తెలుగు సినిమా అ..తో మొదలైంది. జస్ట్ చిన్న రోల్ కావడం.. సినిమా పాపులర్ కాకపోవడంతో.. నిత్య హైలెట్ కాలేదు.బాలీవుడ్ జనాలకు మాత్రం లెస్బియన్ గా నిత్య బాగా నచ్చేసింది.