సమంత రేంజ్ అందుకోవడం, ఏమంత సులభం కాదంటున్నారు .....??
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకుంది. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత నటన, అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఎంతో ఫిదా అయ్యారు. అప్పట్లో కేవలం సమంత కోసమే ఈ సినిమాని అనేకసార్లు చూసిన వారు కూడా ఉన్నారు.
ఈ సినిమా అనంతరం సమంతకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత దూకుడు, బృందావనం, ఈగ వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఆమెకు అటు తమిళ నాట కూడా పలువురు స్టార్ నటుల సినిమాల్లో అవకాశాలు రావడం, వాటిని ఆమె మంచి సక్సెస్ లు గా మలచుకోవడం జరిగింది. అలానే ఇటు తెలుగులో కూడా మంచి సక్సెస్ లు అందుకుంటూ ముందుకు సాగిన సమంత, మొత్తంగా తన కెరీర్ లో ఎక్కువగా విజయాలనే సొంతం చేసుకున్నారు. అయితే కెరీర్ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూసిన సమంత, హిట్స్ నే కాదు ఫ్లాప్స్ వచ్చిన సమయంలో కూడా మనసు నిబ్బరంగా ఉంచుకోవాలని అంటుంటారు. అనంతరం కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో కొంత జాగ్రత్త వ్యవహరించిన సమంత, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా, కొంత అలోచించి సినిమాలు చేయడం మొదలెట్టారు.
ఇక ఇటీవల తన మొదటి సినిమా హీరో నాగచైతన్య ను ప్రేమించి పెళ్ళిచేసుకుని అక్కినేని వారి కోడలుగా మారిపోయిన సమంత, ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎంచుకంటూ ముందుకు సాగుతున్నారు. నటిగా తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత సామజిక సేవకు నియోగించాలని భావించిన సమంత, ఆ తరువాత ప్రత్యుష ఫౌండేషన్ పేరుతో ఒక సామజిక సంస్థను స్థాపించి ఇప్పటివరకు తనకు వీలైన విధంగా పేద, సాదలకు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసి, అవన్నీ దాటుకుంటూ వెళ్లి, ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన సమంత రేంజ్ ని నేటి హీరోయిన్లు అందుకోవడం ఏమంత సులభం కాదంటున్నారు సినీ విశ్లేషకులు......!!