వర్మ పవర్ స్టార్ ట్రైలర్ లీక్.. వెలుగులోకి సంచలన విషయాలు...?
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న పవర్ స్టార్ సినిమా ట్రైలర్ కాసేపట్లో రిలీజ్ కాబోతుందనగా లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ చూసిన వారెవరికైనా ఇది పవన్ కల్యాణ్ పై సెటైర్ అన్న సంగతి ఇట్టే గుర్తు పట్టేస్తారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమా కోసం అచ్చం పవన్ కల్యాణ్, చంద్రబాబులను పోలిన నటులను ఎంచుకుని.. వారి ఫోటోలతో రచ్చ మొదలెట్టేశాడు కూడా.
ఈ ట్రైలర్ కు కూడా రూ. 25 టికెట్ పెట్టేశాడు వర్మ. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పవర్ స్టార్' ట్రైలర్.. రాంగోపాల్ వర్మ విడుదల చేయడానికి ముందే ఓ వెబ్‌సైట్‌కు సంబంధించిన యూట్యూబ్ చానెల్‌లో లీక్ అయ్యింది. ఈ ట్రైలర్ నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో వర్మ చాలా అంశాలు చూపించాడు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మొదలెట్టి ఆ తర్వాత జరిగిన చాలా విషయాలను అందులో చూపించాడు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా.. ఆర్జీవీ ట్రైలర్ ను కూడా డబ్బు పెట్టి చూసేలా నిబంధన విధించాడు. ఆర్జీవీ వరల్డ్ పేరుతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్న వర్మ.. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టి లో ఉంచుకుని.. ఈ పవర్ స్టార్ సినిమా ట్రైలర్ తో కూడా డబ్బు సంపాదించాలనుకున్నా లీక్ కారణంగా ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ బుధవారం 11 గంటలకు విడుదల కావాలి. ఈ సందర్భంగా ఆర్జీవీ కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ట్రైలర్ లీక్ కావడంతో దాన్ని యూట్యూబ్ లో పెడతానని వర్మ ప్రకటించాడు. డబ్బు చెల్లించి వారందరికీ వెనక్కు ఇస్తానన్నాడు వర్మ.