అఖిల్ మూవీలో, నాగ్ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ .....??

GVK Writings

విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడు కింగ్ నాగార్జున. తొలి సినిమాతోనే తన యాక్టింగ్ టాలెంట్ తో అక్కినేని ఫ్యాన్స్ ని, అలానే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ, వాటిని విజయాలుగా మలుచుకుంటూ టాలీవుడ్ మన్మథుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఆయన నటవారసులుగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోలుగా కొనసాగుతున్నారు. 

కొన్నాళ్ల క్రితం అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ చిన్న తనయుడు అఖిల్, ప్రస్తుతం తన నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యువ సక్సెస్ఫుల్ సినిమాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తుండగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. కొన్నేళ్ల క్రితం నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన నిర్ణయం సినిమా, అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 

ఆ సినిమాలోని హలో గురు ప్రేమకోసమే సాంగ్ అయితే అప్పట్లో శ్రోతలను విశేషంగా అలరించింది. కాగా ఆ సాంగ్ ని ప్రస్తుతం అఖిల్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో రీమిక్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయిందని, అతి త్వరలో తదుపరి షెడ్యూల్ మొదలైన అనంతరం దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో చిత్రికరించనున్నారని టాక్. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: