పవర్ స్టార్ మూవీ గురించి భయపడుతున్న ఆముగ్గురు !

Seetha Sailaja

ఇప్పటివరకు అనేక సందర్భాలలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆ నలుగురు శాసిస్తున్నారు అంటూ అనేకసార్లు రగడ జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఆ ముగ్గురు తప్పు దోవ పట్టించారు అంటూ రామ్ గోపాల్ వర్మ తన పవర్ స్టార్ మూవీలో చెప్పబోతున్న పరిస్థితులలో  ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు అంటూ ఆసక్తిక చర్చలు మొదలైపోయాయి.  


వివాదాలకు అను నిత్యం చిరునామాగా ఉండే వర్మ గతంలో ఎన్నో వివాదాస్పద  సినిమాలు తీసినా ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న 'పవర్ స్టార్' మూవీ క్రేఅట్ చేసినంత ఆతృత ఈమధ్య కాలంలో వర్మ సినిమాలు ఏవి ఆసక్తి కలిగించలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం వర్మ టార్గెట్ పవన్ కాదని ఇండస్ట్రీకి సంబంధించిన ఆముగ్గురు  పెద్దలని అంటున్నారు.  


ఈ ముగ్గురు పవన్ ను తప్పుదోవ పట్టించడంతో పవన్ ఘోరంగా ఓడిపోయాడు అన్న సంకేతాలు వర్మ ఈ మొవిఏ ద్వారా ఇవ్వ బోతున్నట్లు  తెలుస్తోంది. గతంలో వర్మ తీసిన  ‘రక్త చరిత్ర'  ‘వంగవీటి' ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రాలకు విడుదల సమయంలో కేసుల సమస్యలు వచ్చిన రీత్యా ఇప్పుడు వర్మ తన పద్ధతిని మార్చుకుని పవన్ ను కాకుండా  ఆ ముగ్గురిని టార్గెట్ చేస్తూ తాను ఎప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానినే అన్న సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్.  


ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఫ్లాట్‌ఫాంలో  ‘క్లైమాక్స్' ‘నగ్నం' వంటి చిత్రాలను విడుదలచేసి ఈ కరోనా సమయంలో కూడ డబ్బులు దండుకుంటున్న వర్మ ఈసారి ఈ మూవీలో  చిరంజీవి త్రివిక్రమ్ చంద్రబాబు నాయుడులను పోలిన వ్యక్తులను కూడా చూపించి మరో వివాదానికి  తెర లేపుతున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఒక సినిమా ట్రైలర్ ను చూడాటానికి డబ్బు పెట్టిన సందర్భాలు లేవు. అయితే పవర్ స్టార్  ట్రైలర్ విషయంలో టికెట్ పెట్టి వర్మ చేస్తున్న సాహసంతో పాటు ఇప్పడు ఆ ముగ్గురు ఎవరు అంటూ అనేక ఊహాగానాలకు తెర లేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: