సమంత సర్ ప్రైస్ చేస్తుందట..!

shami

అక్కినేని కోడలు సమంత ఓ బేబీ తర్వాత సినిమాలు ఏవి ఒప్పుకోలేదు. కోలీవుడ్ లో ఓ సినిమా సైన్ చేసినా అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. అమేజాన్ ప్రైం లో సూపర్ హిట్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత నటించిన విషయం తెలిసిందే. రాజ్, కృష్ణ రూపొందించిన ఈ వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో నటించిందని తెలిసిందే.. సమంత పాత్రపై ఆ వెబ్ సీరీస్ లో నటించిన మరో హీరోయిన్ ప్రియమణి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వెబ్ సీరీస్ లో సమంత పాత్ర సర్ ప్రైస్ చేస్తుందని అన్నారు ప్రియమణి.

 

ఈ వెబ్ సీరీస్ లో సమంత టెర్రరిస్ట్ గా కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రియమణి దాన్ని కన్ ఫర్మ్ చేయకుండా కచ్చితంగా సమంత పాత్ర వినగానే తాను ఎగ్జైట్ అయ్యానని.. తన పాత్ర గురించి ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారని చెప్పింది ప్రియమణి. చూస్తుంటే తన ఇన్నేళ్ళ సినీ కెరియర్ లో కూడా సమంత చేయని పాత్ర వెబ్ సీరీస్ లో చేసినట్టు తెలుస్తుంది. ఇక కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని ఫిక్స్ అయిన సమంత విక్రం కుమార్ డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న థ్యాంక్యూ సినిమాలో నటిస్తుందని అంటున్నారు.

 

అంతేకాదు సొంతంగా ఓ ప్రొడక్షన్ ను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట చై,స్యామ్ లు. అందుకే సినిమాలను తగ్గించేస్తుందట. ఇప్పటికే అన్నపూర్ణ బ్యానర్ ఉండగా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చేలా ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చైతన్య, సమంత.                                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: