బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ గుండెపోటుతో మృతి.. కానీ అతను రణబీర్ కాదట..?
సినిమా ఇండస్ట్రీ లో అయితే ప్రతి హీరోకి కూడా ఒక డూప్ ఉంటాడు అనే విషయం తెలిసిందే... కొంతమంది హీరోలకు అయితే అచ్చం అచ్చుగుద్దినట్టుగా... అదే పోలికలతో ఉంటారు డూప్ లు . అయితే బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ కి జిరాక్స్ ల ఉన్న ఓ వ్యక్తి ఆ మధ్యకాలంలో వార్తల్లో నిలిచాడు. రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ సైతం తన కొడుకును పోలీ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. రణబీర్ కపూర్ పోలికలతో ఉండి మోడల్ గా రాణిస్తున్న ఆ వ్యక్తి పేరు జునైద్ షా. కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన జునైద్ అచ్చుగుద్దినట్లుగా రణబీర్ లాగే ఉంటాడు. అయితే తాజాగా రణబీర్ లా ఉండే జునైద్ గుండెపోటుతో మరణించాడు. యువ వయస్సు లోనే జునైద్ గుండెపోటుతో మరణించడం తో అతని అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
ఇక ఈ విషయాన్ని కాశ్మీర్ జర్నలిస్టు ఒకరు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మోడలింగ్ వృత్తిలో కొనసాగుతున్న జునైద్.. తమకు అండగా ఉంటాడు అని తల్లిదండ్రులు అనుకుంటున్న తరుణంలోనే ఆకస్మాత్తుగా గుండెపోటుతో జునైద్ మృతి చెందటంతో అతని కుటుంబంలో విషాదం నిండిపోయింది. మోడలింగ్ లో రాణించడంతో పాటు...నటన పై కూడా జునైద్ ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు ఆ జర్నలిస్టు చెప్పుకొచ్చారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్న జునైద్ అకస్మాత్తుగా గుండెపోటు తో మరణించటం నిజంగా విషాదకర వార్త అంటూ జర్నలిస్ట్ యూసుఫ్ జమీల్ తెలిపారు.Powered by Froala Editor