హైదరాబాద్ సేఫ్ అంటున్న రకూల్ ప్రీత్ సింగ్.. ఎందుకో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీలో కెరటం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది. ఇక తెలుగు లో స్టార్ హీరోలతో వరుస చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస హిట్ సినిమాలో అప్పట్లో ఈ బాలీవుడ్ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ మద్య హిందిలో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే రాబట్టింది. ఈ బ్యూటీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ లో ఢిల్లీలో ఉంటుంది.
ఇటీవల కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, దీనికి తోడు కాలుష్యం కూడా పెరుగుతుండడంతో అక్కడ ఉండేందుకు భయపడుతోంది. ఇప్పటికే అక్కడ లక్ష కేసులు దాటిన విషయం తెలిసిందే. దీంతో తన సోదరుడితో కలిసి హైదరాబాద్ వచ్చేసింది. ఈ అమ్మడికి హైదరాబాద్ లో జిమ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆ మద్య హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమీపంలో రకుల్ సొంత ఇల్లు ఉన్న విషయం విదితమే.
ప్రస్తుతం తన సోదరునితో కలిసి ఇక్కడే నివసించేందుకు ఆమె నిర్ణయించుకున్నది. అంతేకాదు ఢిల్లీకన్నా ఇప్పుడు హైదరాబాద్ సేఫ్ జోన్ లా కనిపిస్తుందని అంటుంది. హైదరాబాద్ లో ఉంటె తనకు ఉన్న ఎఫ్ 45 జిమ్ వ్యవహారాలను కూడా చూసుకోవడానికి వీలు ఉంటుందని ఆమె అంటోంది.