ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కామెడీ కి పగలబడి నవ్వాల్సిందే సుమీ..?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన ఎంత పిక్స్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెంపర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లోని సరికొత్త నటుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అద్భుతం గా ఉంటుంది. ముఖ్యంగా వాల్తేరు వాసుగా విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉండే ప్రతి సన్నివేశంలో కూడా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుంది.
ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వాల్తేరు వాసు గా ఉన్న ప్రకాష్ రాజ్ ను... ఏరా అంటూ పిలిచినప్పుడు నన్ను రా అంటావా అని ప్రకాష్ రాజు అడగ్గానే.. ఏరా నువ్వు నా అన్నవి కాదారా.. అన్నను రా అనకూడదారా.. ఇదేనారా మన మధ్య ఉన్న అనుబంధం అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. అంతే కాకుండా మరో సన్నివేశంలో... మనిద్దరం పెళ్లి చేసుకుందాం.. ఎన్నాళ్ళని ఇలా గాడిదల్లా తిరుగుతాం చెప్పు.. అందుకే మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసి, నేను కూడా పెళ్లి చేసుకుంటా... అంటూ ప్రకాష్ రాజ్ తో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెబుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ హావభావాలు జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లతో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ పొట్ట చెక్కలవాల్సిందే. ఇలా టెంపర్ సినిమాలో ప్రకాష్ రాజ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉండే ప్రతి సన్నివేశం కూడా ఎంతో హాస్యభరితంగా... ప్రేక్షకులను హాయిగా నవ్వుకునేలా చేస్తోంది.Powered by Froala Editor