ట్రైలర్ తో దుమ్మురేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత'....!!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఎన్టీఆర్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాబోయే జనవరి 8 న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు ముందు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకవంలో ఎన్టీఆర్ నటించిన సినిమా అరవింద సమేత.
వాస్తవానికి అంతకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసితో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న త్రివిక్రమ్, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో దీనిని తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ దీనిని నిర్మించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే కథకు హృద్యమైన ఎమోషనల్ సన్నివేశాలు, తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ని జోడించి దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టారు.
వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అనంతరం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ట్రైలర్ తో, సినిమా ఏ విధంగా సాగనుంది అనేటువంటి హింట్ ని ప్రేక్షకులకు అందించారు త్రివిక్రమ్. యాక్షన్ తో పాటు కామెడీ, పవర్ఫుల్ డైలాగ్స్, ఫైట్స్ వంటి పలు ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అప్పట్లో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ లో దుమ్మురేపింది. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం సినిమా కూడా ప్రేక్షకుల మదిని గెలుచుకోవడంతో, ఎట్టకేలకు త్రివిక్రమ్ అరవింద తో హిట్ అందుకున్నారు.......!!