ఔరా..! అనేలా ముద్దుగుమ్మల క్యారెక్టర్స్

NAGARJUNA NAKKA

హీరోయిన్ అంటే.. ఓ పది సీన్స్.. నాలుగు పాటలు.. మొత్తం మీద ఓ నెల రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే చాలు. ఇలాంటి వాతావరణం నెమ్మదిగా మారుతోంది. సినిమాకు హీరోనే కాదు.. హీరోయిన్ కూడా ఇంపార్టెంటో మన రచయితలు.. దర్శకులు నిరూపిస్తున్నారు. స్టార్స్ పక్కన నటిస్తున్న ముద్దుగుమ్మల పాత్రలు చూస్తే.. మీరు కూడా నిజమే అంటారు. 

 

పెర్ ఫార్మెన్స్ ఛాన్స్ రావాలే గానీ.. ముద్దుగుమ్మలు సైతం తామేమిటో నిరూపిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువ గా చేస్తున్న కీర్తి సురేష్.. హీరో పక్కన బలమైన పాత్ర ఉంటేనే సైన్ చేస్తోంది. ఈ క్రమంలో సర్కారు వారి పాటలో మహేశ్ తో జతకడుతోంది. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో.. దర్శకుడు పరశురామ్ కీర్తికి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడనీ.. బ్యాంక్ అధికారిగా నటిస్తోందని సమాచారం. 

 

సాధారణంగా ఫస్ట్ లుక్ లో హీరో ఒక్కడే కనబడతాడు. అయితే.. రాధే శ్యాం ఫస్ట్ లుక్ రొమాంటిక్ గా డిజైన్ చేశారు. టైటిల్ లో హీరోయిన్ పేరు రాధ ఉండటంతో పూజా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుస్తోంది. 60వ దశకం లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ పీరియాడికల్ మూవీలో పూజా టీచర్ గా నటిస్తోందట.  

 

పుష్ప సినిమాలో రష్మికది కూడా ప్రాధాన్యమున్న పాత్రే. గిరిజన యువతిగా ఫస్ట్ టైమ్ డీగ్లామరైజ్డ్ రోల్ పోషిస్తోందని సమాచారం. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికిందన్న ఆనందంలో రష్మిక ఉంది. సినిమా ఈ అమ్మడి మాట తీరు చిత్తూరు స్లాంగ్ లో ఉంటుందట. దీనికోసం ప్రత్యేకంగా లాక్ డౌన్ సమయంలో శిక్షణ తీసుకొని.. ప్రాక్టీస్ కూడా చేసిందట ఈ కన్నడ బ్యూటీ. మొత్తానికి ముద్దుగుమ్మలు తామేమిటో నిరూపించుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. చూద్దాం.. ఈ బ్యూటీస్ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటారో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: