హీరోయిన్స్ ను తమ పెళ్లి గురించి అడిగితే తమకు పూర్తిగా నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదని సమాధానం ఇస్తూ మీడియాను శక్తి మేరకు తప్పు దోవ పట్టిస్తూనే తమకు నచ్చిన పారిశ్రామిక వేత్త లేదా హీరో ఎక్కడ దొరుకుతాడా అని వేట కొనసాగిస్తూ ఉంటారు. అయితే పెళ్లీడుతో ఉన్న కంగనా రనౌత్ మాత్రం తాను నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రాణి’ చూస్తే, తననెవరూ పెళ్లి చేసుకోరని ఒక బహిరంగ ప్రకటన ఇచ్చి బాలీవుడ్ లో సంచనం కలిగిస్తోంది.
వివరాలడిగితే ఆ సినిమా చూడాల్సిందే అని అంటోంది. అయితే సినిమా ప్రచారం కోసమే కంగనా ఇలా అంటున్నదేమో అనుకుంటే, తన వ్యక్తిగత జీవితానికి మైనస్ అయ్యేలా ఎందుకు కంగన ఇలా మాటలడుతోంది అనే అనుమానం కలుగుతుంది. బహుశా ఈ సినిమాలో కంగనా రొటీన్‌కి భిన్నంగా, చెయ్యకూడని పాత్ర ఏదో చేసి ఉంటుందని టాక్.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో ఆమె ఓ రాజకీయ నాయకురాలి పాత్ర చేసిందని, ఓ సినిమా హీరో పై ఆ సినిమాలో మనసు పడుతుందని తెలుస్తోంది. కంగనాపై పగ తీర్చుకోవడానికి ప్రత్యర్థులు ఆ సినిమా హీరోని కిడ్నాప్ చేస్తే, అతణ్ణి కాపాడుకోవడానికి ఆమె రంగంలోకి దిగుతుంది కాబట్టి, మెది చాలా బోల్డ్ కేరక్టర్ అని అర్థమవుతుంది.
ఈ పాత్రలో కంగన గ్లామరస్‌గా కనిపించడం మాత్రమే కాదు... వీరోచిత పోరాటాలు కూడా సిందట. అందుకే కాబోలు ఆ పోరాటాలు చూసాక తనను ఎవరు పెళ్లి చేసుకోరని కంగన భయ పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె హవా నడుస్తోంది కాబట్టి ఈమె ఏమి చెప్పినా అది మీదియుకు న్యూస్.
మరింత సమాచారం తెలుసుకోండి: