ఈ దర్శకులు హిట్ కొట్టకపోతే కెరీర్ కష్టమే.. !
సక్సెస్ లో ఉన్నోళ్లదే రాజ్యమిక్కడ. ఈ సక్సెస్ కు దూరమైతే ఒక్కోసారి ఫేడౌట్ అయ్యే ప్రమాదముంది. చాలామంది దర్శకులు ఈ రెడ్ జోన్ లోనే ఉన్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాతో హిట్ కొట్టకపోతే కెరీర్ కష్టమనే ఫేజ్ లోకి వెళ్లిపోతుంది. ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు కొందరు దర్శకులు.
కార్తికేయ సినిమాతో ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ పాస్ చేశాడు చందూ మొండేటి. ఆ తర్వాత నాగచైతన్యతో తీసిన ప్రేమమ్ కూడా ఈ మేకర్ కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. కానీ ఈ జర్నీలో తీసిన సవ్యసాచి సినిమా చందు మొండేటి ఇమేజ్ ను దెబ్బతీసింది.
సవ్యసాచి డిజాస్టర్ తో చందు మొండేటి ఢీలా పడ్డాడు. కాస్త గ్యాప్ తీసుకొని తనకు డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ సిద్ధం చేశాడు. ఈ మూవీ హిట్ అయితేనే.. చందు మొండేటి పేరు మరోసారి వినిపిస్తుంది.
బొమ్మరిల్లు సినిమాతో సంచలనం సృష్టించిన భాస్కర్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఒంగోలు గిత్త ఫ్లాపుతో ఆరేళ్లు టాలీవుడ్ కు దూరమయ్యాడు. తర్వాత తమిళంలో బెంగళూరు డేస్ సినిమా రీమేక్ కూడా భాస్కర్ ను ఆదుకోలేదు.
తమిళంలో అధృష్టం పరీక్షించుకున్న బొమ్మరిల్లు భాస్కర్ కు దురదృష్టం వెంటాడింది. దీంతో మళ్లీ తెలుగులోకి షిఫ్ట్ అయి.. అఖిల్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ మూవీ తీస్తున్నాడు. అఖిల్ కూడా చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకేసారి ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది చూడాలి.
అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. డెబ్యూ మూవీ కొత్త బంగారు లోకం తర్వాత రెండో సిినిమాకే మహేశ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఎప్పుడో మరిచిపోయిన మల్టీస్టారర్ మూవీకి ఊపిరిపోశాడు. ఇదే నమ్మకంతో బ్రహ్మోత్సవంకు ఛాన్స్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్ని కథలు రెడీ చేసుకొని.. ఎంతమంది నిర్మాతలను.. హీరోలను కలిసినా ఛాన్స్ దక్కలేదు.