తండ్రి ఇమేజ్ ని వాడుకోని నాగ చైతన్య

Gullapally Venkatesh

మన తెలుగు లో మంచి స్టార్ ఇమేజ్ ఉన్నా సరే తనకు తానుగా పైకి రావాలి అని ప్రయత్నం చేసే హీరో నాగ చైతన్య. అతని సినిమాలు అతని నటన చూస్తే ఈ విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అతనికి తండ్రి ఇమేజ్ చాలా బాగా కలిసి వస్తుంది అని భావించినా సరే అతను తండ్రి ఇమేజ్ ని మాత్రం ఏ విధంగా కూడా వాడుకున్న సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. స్టార్ హీరో గా అతను తెచ్చుకున్న మంచి ఇమేజ్ అతనికి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అగ్ర హీరోగా అతను పైకి రావాలి అని ప్రయత్నాలు చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు. 

 

ఇక అతనికి తండ్రి ఇమేజ్ ని వాడుకునే ఆలోచన ఏ దశలో కూడా లేదు అని చాలా మంది ఆయన ఫాన్స్ కూడా అంటారు. ఇక తండ్రి నాగార్జున కూడా అతని సినిమాల విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోడు. అందుకే హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా సరే ఆయన చేసే సినిమాలకు ఎవరి నుంచి ఒత్తిడి కూడా ఉండదు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు భార్య సమంతా సలహాలను తీసుకుంటున్నాడు గాని అంతకు ముందు అసలు ఎవరి సలహాలను అతను తీసుకోలేదు అని అంటారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. 

 

అతని సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతని చేతిలో ఉన్న ఒక సినిమాకు నిర్మాత నాగార్జున అని టాక్. తండ్రి ప్రత్యేకంగా ఒక కథను చైతు తో చేయించాలి అని భావించి ఈ సినిమాను చేయిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి  అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది త్వరలోనే తెలియనుంది. ఇప్పుడు చైతు చేస్తున్న సినిమా లాక్ డౌన్ లో ఆగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: