పెద్ద హీరోతో శేఖర్ కమ్ముల సినిమా.. !
వెనకాల సక్సెస్ ఉన్నా.. లేకపోయినా.. కూల్ గా ఉండే దర్శకుడు శేఖర్ కమ్ముల. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేయాలి. రేసులో దూసుకుపోవాలన్న టార్గెట్స్ లాంటివేమీ ఈ దర్శకుడికి ఉండవు. అయితే ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఫస్ట్ టైమ్ స్పీడు పెంచాడు. సెట్స్ పై సినిమా ఉండగానే.. మరో మూవీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ సారి స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టాడని చాలా మంది అనుకుంటారు. అయితే 99లోనే డాలర్ డ్రీమ్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ 21ఏళ్ల కెరీర్ లో తీసింది ఎనిమిది సినిమాలు మాత్రమే. ఆనంద్.. గోదావరి.. హ్యాపీ డేస్.. ఫిదా లాంటి హిట్ మూవీస్ తో తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించాడు శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఫిదా. దాదాపు 50కోట్లు కలెక్ట్ చేసింది. దీని తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని.. నాగచైతన్య, సాయిపల్లవితో లవ్ స్టోరీ మొదలుపెట్టాడు. సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా అడ్డుపడింది. ఇంకా 15రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. లాక్ డౌన్ టైమ్ ను యూజ్ చేసుకొని.. తర్వాతి మూవీ కథ రాసేసుకున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ నిర్మిస్తున్న నారాయణ దాస్ నారంగ్ ఈ సినిమాను కూడా నిర్మిస్తారట.
మొత్తానికి లాక్ డౌన్ శేఖర్ కమ్ములకు బాగా ఉపయోగపడింది. తర్వాతి మూవీ కథను రెడీ చేసేసుకున్నాడు. ఇంత వరకు స్టార్స్ జోలికి వెళ్లని శేఖర్ కమ్ముల ఈ సారి పెద్ద హీరోను డైరెక్ట్ చేయనున్నాడని టాక్. పెద్ద హీరోల కంటే ప్రస్తుతం ఒక్కరూ ఖాళీగా లేరు. ప్రభాస్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్, బన్నీ.. రెండేళ్ల వరకు బిజీ. మహేశ్ తర్వాత పరశురామ్ సినిమాలో జాయిన్ అవుతాడు. మరి శేఖర్ కమ్ముల మనసులో ఉన్న ఆ పెద్ద హీరో ఎవరో చూడాలి.