ఆరుపదుల వయసులో అద్భుతంగా డ్యాన్స్ వేసిన చిరంజీవి..!

Suma Kallamadi
తెలుగు పరిశ్రమకి బ్రేక్ డాన్స్ లు, వెస్ట్రన్ డాన్స్ లు నేర్పించిన మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో ఎన్నో రకాల డ్యాన్సులను అత్యద్భుతంగా వేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసాడు. ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ పాటకు అతడు వేసిన స్టెప్పులను ఇప్పటికీ ఎవరు సరిగ్గా వేయలేరంటే అతిశయోక్తి కాదు. లంకేశ్వరుడు సినిమా లో పదహారేళ్ళ వయసు పాటలో చిరంజీవి వేసిన బ్రేక్ డాన్స్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈ పాటలో చిరంజీవి వేసిన స్టెప్పులు ఈతరం యంగ్ హీరోలు కూడా వేయలేరేమో అనేట్టు ఉన్నాయి. పసివాడి ప్రాణం సినిమాలో చక్కని చుక్క పాటలో మైకల్ జాక్సన్ వలే కాష్టం వేసుకొని అత్యద్భుతంగా నృత్యం చేసిన చిరంజీవికి ఎనర్జీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యముడికి మొగుడు సినిమా లో అందం హిందోళం పాటకి చిరంజీవి వేసిన స్టెప్పులు కూడా అప్పటి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. రిక్షావోడు సినిమాలోని రూప్ తేరా మస్తానా, ముఠామేస్త్రి సినిమా లో ఈ పేటకు నేనే మేస్త్రి పాటలలో చిరంజీవి వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు వెండితెరపై మ్యాజిక్ సృష్టించాయి.

దొంగ సినిమాలో గోలీమార్ పాట లో చిరంజీవి సరికొత్త కాస్ట్యూమ్ లో కనిపించి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి ప్రముఖ పాప్ సింగర్ మైకల్ జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ పాట నుండి గోలీమార్ పాట స్ఫూర్తి గా తీసుకొనబడింది. ఈ విధంగా ఎంతో శ్రమించి అంతర్జాతీయ డ్యాన్సర్ల వలే స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా సినీ పరిశ్రమలో మళ్లీ అరంగ్రేటం చేసిన చిరంజీవి తన అరవై ఏళ్ళ వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా అద్భుతమైన డాన్స్ స్టెప్పులు వేసి ప్రేక్షకుల మతిపోగొట్టేశాడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో కాజల్ సరసన ఉడుకు రక్తం కలిగిన యువకుడిలా డాన్స్ స్టెప్పులు వేసి తనలో ఇంకా శక్తి తగ్గి పోలేదని చెప్పకనే చెప్పేశాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: