హెరాల్డ్ స్పెషల్ JUNE 2020 : సుశాంత్ సూసైడ్

Suma Kallamadi

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14వ తేదీన ముంబై నగరం లోని బాంద్రా నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి ఆత్మహత్య భారతదేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మూడు పదుల వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. కావాల్సినన్ని ఆస్తిపాస్తులు, స్టార్ డం ఉన్నప్పటికీ అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్న విషయం పెద్ద మిస్టరీగా మారింది. జూన్ 8వ తేదీన సుశాంత్ సింగ్ మేనేజర్ దిశా సలియాన్ కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 


ఆ విషయం మరువకముందే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. సుశాంత్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ అన్ని కూడా విఫలం కాగా... తాను డిప్రెషన్ కి లోను అయ్యాడని... ఆరు నెలలగా ఒంటరిగా నివసిస్తూ తనలో తానే కృంగిపోయాడని సన్నిహితులు చెప్పారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ నేపోటిజం(బంధు ప్రీతి)  కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. నిజానికి సినీ పరిశ్రమలో బడా హీరోల వారసత్వ పెత్తనాలు బాగా నడుస్తాయి. ఎదిగే వాడిని ఎదగనివ్వకుండా అణచి వేయడానికి బడా హీరోలు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి అనుభవాలను చవిచూసిన ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ సినీ పరిశ్రమ నుండి వైదొలిగారు కానీ ఆత్మహత్యలకు పాల్పడలేదు. కానీ సుశాంత్ సింగ్ చాలా సున్నితమైన వ్యక్తి కాబట్టి ఆత్మహత్య చేసుకునే ఆస్కారం ఉందని బాలీవుడ్ ప్రముఖ నటీనటులు అభిప్రాయపడుతున్నారు. 


ఇకపోతే ఈ సంఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా అతని హత్య వెనక సరైన కారణం తెలియరాలేదు. డీసీపీ త్రిముఖే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని... ఇందులోని భాగంగా 27 మందిని విచారించామని ఆయన తెలిపారు. సుశాంత్ తండ్రి కె.కె సింగ్, మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి, స్నేహితులు సందీప్ సింగ్, నిలోపటల్ తదితరులను పోలీసులు విచారించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: