నా మాటే శాసనం అంటూ ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ..!

Suma Kallamadi

బాహుబలి ద్వారా సినిమాల్లో అత్యద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ సూపర్ క్రేజ్ ని దక్కించుకుంది. నరసింహా, నీలాంబరి సినిమాల తర్వాత తనకు ఎక్కువగా క్రేజ్ తెచ్చిన చిత్రం ఏదైనా ఉందా అని అడిగితే అది బాహుబలి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నరసింహ సినిమా లో రజనీకాంత్ కి విలన్ గా నటించిన రమ్యకృష్ణ తనకు డబ్బింగ్ తానే చెప్పుకుంది. అప్పట్లో ఆమె చెప్పిన డైలాగులకు అందరూ ఫిదా అయిపోయారు. మళ్లీ బాహుబలి సినిమాలో శివగామి దేవి పాత్ర లో నటించిన రమ్యకృష్ణ తమిళ తెలుగు భాషల్లో తనకు తానే డబ్బింగ్ చెప్పుకొని ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. 


ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్రప్రసాద్ శివగామి పాత్రకు రమ్యకృష్ణ డబ్బింగ్ చెప్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారట. దీంతో కుమారుడు రాజమౌళి కూడా రమ్యకృష్ణ ని డబ్బింగ్ చెప్పాలంటూ ఒప్పించాడు. అయితే ఆమె మొదటి లో కాస్త కష్టపడినా ఆ తర్వాత అద్భుతంగా డైలాగులు చెప్పి శివగామి పాత్రకు ప్రాణం పోసింది. "కట్టప్పా !!!!, వీళ్ళ తిరుగబాటుతో మహీష్మతి కి మకిలి పట్టింది, రక్తం తో కడిగేయ్', అని శివగామి దేవి చెప్పే డైలాగ్ రోమాలు నిక్క పొడిచేలా ఉందని చెప్పుకోవచ్చు. ఇది నా మాట... నా మాటే శాసనం!!! అంటూ రమ్యకృష్ణ కంచు కంఠంతో చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు.


ఈ ఒక్క డైలాగ్ తో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వందమందిని చంపితే వీరుడు అంటారు. అదే ఒక్కడిని కాపాడిన దేవుడు అంటారు అనే డైలాగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అనుష్క శెట్టి కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ సౌమ్య శర్మ కూడా అద్భుతంగా డైలాగులు చెప్పి అందరినీ బాగా అలరించింది. కేవలం ఆమె వాయిస్ మాత్రమే కాదు ప్రభాస్ తల్లిగా రమ్యకృష్ణ నటనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఫిదా అయిపోయారు. బాహుబలి 2 సినిమాలో (మహేంద్ర బాహుబలి) శివుడు గొంతు చించుకొని నేను ఎవరిని అని అడిగే డైలాగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: