నిజంగా ఆ డైలాగ్ ఎన్ని సార్లు విన్నా.... ఆ కిక్కే వేరప్పా.....!!

GVK Writings

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక మిలియనీర్ గా నటించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా, ప్రణీత సుభాష్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. మంచి ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయం సొంతం చేసుకుంది. 

అంతకముందు పవన్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన జల్సా సినిమా కూడా మంచి ఘన విజయం సందించినప్పటికీ కూడా, దానిని మించేలా ఈ సినిమా మరింత పెద్ద హిట్ సాధించి వీరిద్దరి కాంబోకు మరింత గొప్ప క్రేజ్ తెచ్చి పెట్టింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్ మార్క్ పెర్ఫార్మన్స్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కూడా అద్భుతంగా పేలాయి. త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా ఆయన రాసిన డైలాగ్స్, పవన్ తన స్టైల్ లో ఎంతో అద్భుతంగా పలికారు. 

 

సందర్భాను సారం వచ్చే డైలాగ్స్ లో మరీ ముఖ్యంగా ఒక ఫైట్ అనంతరం విలన్ ని ఉద్దేశించి, లాస్ట్ పంచ్ మనది అయితే, నిజంగా ఆ కిక్కే వేరప్పా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో పెద్ద అప్లాజ్ ని దక్కించుకుంది. దీనితో పాటు సినిమాలో మరిన్ని డైలాగ్స్ కూడా థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాయి. అప్పట్లో ఎంతో పెద్ద హిట్ సాధించిన ఈ సినిమా హిట్ అయిన తరువాత, అటు పవన్ తో పాటు ఇటు త్రివిక్రమ్ రేంజ్ కూడా మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ కూడా చాలా మంది నోట వినపడుతుంటాయి అంటే, ఆ డైలాగ్స్ కు ఉన్న పవర్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు......!!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: