రాజకుమారుడితో రామారావు, రాం చరణ్.. మరో 'RRR'..!

shami

మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకున్న టాలీవుడ్ లో ఇప్పుడు ఒకదానికి మించి మరో మల్టీస్టారర్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. స్టార్స్ కూడా సరైన కథ రావాలే కాని తోటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగేలా చేశారు మహేష్, వెంకటేష్. ఆ సినిమా తర్వాత తెలుగులో క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. 

 

ఇక ఇదిలాఉంటే ప్రస్తూం సెట్స్ మీద ఉన్న ట్రిపుల్ ఆర్ కూడా రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్నారు. ఈ సినిమా వీళ్లిద్దరు చేసిన మహేష్ కూడా వీరిద్దరికి తోడై.. మహేష్, రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి సినిమా చేస్తే చూడాలని అనుకుంటున్నారు ప్రేక్షకులు. వెండితెర మీద ఒక స్టార్ కనిపిస్తేనే ఆనంద పడే తెలుగు ప్రేక్షకులు ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ కలిసి చేస్తే మాత్రం దుమ్ముదుమారమే అని చెప్పొచ్చు.

 

ఈ కాంబో కలిస్తే అప్పటివరకు రికార్డుల లెక్క ఎంతైనా ఉండనివ్వండి.. అవన్ని తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెప్పొచ్చు. చరణ్, మహేష్, ఎన్.టి.ఆర్ కలిసి చేసే సినిమా న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుంది. మరి అలాంటి కథను ఎవరు సిద్ధం చేస్తారు.. ఏ డైరక్టర్ ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయగలడు అన్నది చూడాలి. ఈ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు అనే వార్త వచ్చినా సరే ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్న ఈ ముగ్గురు స్టార్స్ ఈమధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నారు. మరి పనిలోపనిగా ముగ్గురు కలిసి సినిమా చేసేద్దాం అనుకుని మంచి కథని సెలెక్ట్ చేసుకుంటే అంతకుమించిన ట్రెండ్ సెట్టర్ మూవీ మరోటి ఉండదని చెప్పొచ్చు. అంతేకాదు రాజకుమారుడితో రాం చరణ్, రామారావు కలిసి చేసే ఆ సినిమా మరో ట్రిపుల్ ఆర్ అవుతుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: