
తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి విక్టరీ సాధించిన వెంకటేష్..?
చిత్ర పరిశ్రమలో నిన్నటి మొన్నటి తరం ప్రేక్షకులను అలరించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది సినీ ప్రముఖుల వారసులు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం హీరోలు సీనియర్ హీరోలు చాలామంది ఉన్నారు . తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సినీ ప్రముఖులలో ఒకరు విక్టరీ వెంకటేష్. దాదాపు మూడు దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నారు. తెలుగు కళామతల్లికి ఎనలేని సేవలు చేసి నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని... చిత్రపరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సైతం అందుకున్న దగ్గుబాటి రామానాయుడు వారసుడు విక్టరీ వెంకటేష్.
రామానాయుడు స్టార్ నిర్మాతగా ఉన్న సమయంలోనే విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగానే కొనసాగుతున్నారు విక్టరీ వెంకటేష్. తండ్రి రామానాయుడు ఖ్యాతిని ఎక్కడ తగ్గించకుండా అంతకంతకూ పెంచుతూ తండ్రికి తగ్గ తనయుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్ల లాంటి సినిమాలను తెరకెక్కించి తన పేరు ముందు విక్టరీ అనే పదాన్ని చేర్చుకున్నాడు వెంకటేష్. రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎంతో గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే .
అయితే ప్రస్తుతం రామానాయుడు వారసుడిగా ఉన్నా సురేష్ బాబు వెంకటేష్ లలో ఒకరు నిర్మాణ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంగా... మరొకరు నటనలో మంచి గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్నారు. ఇలా రామానాయుడు ఖ్యాతిని అటు నిర్మాణ రంగం ఇటు నటనలో ఎక్కడ తగ్గించలేదు ఆయన వారసులు. నటన పరంగా రామానాయుడుకు సరైన వారసుడిగా నిరూపించుకున్నారు విక్టరీ వెంకటేష్. అదే సమయంలో నిర్మాణరంగంలో తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు నిర్మాత సురేష్ బాబు.