తన ఆటిట్యూడ్ తో ఏకంగా బాస్ ని పడేసిన అల్లు అర్జున్..?
అదేంటోగాని స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఇట్టే హీరోలతో ప్రేమలో పడి పోతూ ఉంటారు. చిన్న హీరోలు అయితే హీరోయిన్ లను పడేయడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కానీ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు మాత్రం హీరోలకి ఈజీగానే పడిపోతుంటారు. అయితే సినిమా సినిమాకి కాస్త డిఫరెంట్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ... స్టార్ హీరోల సినిమాల్లో హీరోలు హీరోయిన్లు పడేయడానికి పెద్దగా కష్టపడరు . అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ప్రేక్షకుల ఫేవరేట్ జోడి గా పేరు తెచ్చుకున్నా అల్లు అర్జున్ పూజ హెగ్డే జోడీ మరోసారి అల వైకుంఠపురములో సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలా వైకుంఠపురము లో సినిమా. మాటల మాంత్రికుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. ఈ సినిమాలోని డైలాగులు పాటలు డాన్సులు యాక్షన్ అన్ని తెలుగు ప్రేక్షకులను మైమరపింప చేస్తాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ విషయానికొస్తే... ఒక టూరిస్ట్ కంపెనీకి బాస్ గా ఉంటుంది పూజ హెగ్డే. అదే టూరిస్ట్ కంపెనీలో ఒక చిన్న జాబ్ లో చేరుతాడు అల్లు అర్జున్.
మొదటినుంచి అల్లు అర్జున్ పూజ హెగ్డే అందం అంటే పడి చచ్చిపోతాడు. ఇక పూజా హెగ్డే కి కూడా కొన్ని కొన్ని సార్లు అల్లు అర్జున్ మంచి ఒపీనియన్ తెచ్చుకుంటాడు . ఇక ఆ తర్వాత ఒక ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ పై పూజా హెగ్డే కు ప్రేమ పుడుతుంది.. ఇలా అల్లు అర్జున్ తన స్టైల్ ఆటిట్యూడ్‌తో ఏకంగా తన భాస్ నే పడేసాడు అల వైకుంఠపురములో సినిమాలో. ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా తెలుగు ప్రేక్షకులకు తెగ ఆకర్షించింది అని చెప్పాలి. ఇక వీరిద్దరి జోడి మరోసారి ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారిపోయింది.