సంచలనాన్ని రేపిన అమలాపాల్ పెళ్లి పోస్టర్లు !

Seetha Sailaja
నిన్న ఉదయం తమిళ హీరో ఆర్య, అమలాపాల్ వివాహం చేసుకున్నట్లు చెన్నైలో పోస్టర్లు విడుదలై సంచలనం సృష్టిం చాయి. వీరి వివాహం ఎప్పుడు జరిగింది? రహస్య వివాహం చేసుకున్నారా? అంటూ చిత్ర వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. కొంత సేపు అలజడి తరువాత ఇది సినిమా పబ్లిసిటీకి సంబంధించిన వార్త అని తెలిసి అందరూ నవ్వుకున్నారు. వివరాల్లోకి వెళితే పార్తిబన్ దర్శకత్వం వహిస్తూ కథ, మాటలు సమకూరుస్తున్న కొత్త సినిమా కోసం ఈ వివాహ దృశ్యం చిత్రీకరించినట్లు తెలిసింది. కోయంబత్తూరులో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఆర్యతో అమలాపాల్ అతిథి పాత్ర లో కనిపిస్తోంది. క్యారక్టర్ తనకు నచ్చడంతో అమలపాల్ ఈ పాత్ర నటించేందుకు అంగీకరించింది అని అంటున్నారు. ఈ వివాహ దృశ్యం గురించి ఆర్య మాట్లాడుతూ ఇది వరకే వేట్టై చిత్రంలో తనకు, అమలాపాల్‌కు వివాహం జరిగినట్లు సన్నివేశం చిత్రీకరించారని, ప్రస్తుతం రెండవ సారి ఈ చిత్రంలోనూ అమలాపాల్‌కు తాళి కట్టినట్టు జోక్ చేసాడు. ఇదేవిధంగా గతంలో కూడ ఆర్య నయనతారను చర్చలో పెళ్లి చేసుకున్నాడు అంటు గతంలో తమిళనాడులో పోస్టర్లు హడావిడి చేసాయి. అయితే ఆ తరువాత వారిద్దరూ నటిస్తున్న ‘రాజా రాణి’ సినిమా కోసం ఈ పబ్లిసిటీ అని తేల్చేసారు. చూస్తూ ఉంటే తనతో నటించిన ప్రతి హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు అంటూ రూమర్లు క్రియేట్ చేసుకునే రికార్డుకు చేరువాలో హీరో ఆర్య ఉన్నాడా అని అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: