బోయపాటి సినిమా తర్వాత బాలయ్య మరో ప్రాజెక్ట్.. !
ఫుల్ స్వింగ్ లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు హీరోలు. కానీ బాలకృష్ణ మాత్రం ఈ ఫార్మాట్ ను పట్టించుకోవడం లేదు. డైరెక్టర్లఫామ్ తో సంబంధం లేకుండా సినిమాలు ఓకే చేస్తున్నాడు. కొన్నాళ్లుగా మెగాఫోన్ కు దూరమైన వెటరన్ డైరెక్టర్ తో కలిసి ఓ సీక్వెల్ ప్లాన్ చేయబోతున్నాడు బాలయ్య.
బాలకృష్ణ సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. అభిమానులు మెచ్చే సిినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. అలాగే కొంచెం కొత్తగా ట్రై చేసేందుకు ముందుంటాడు. అలాగే డైరెక్టర్ల విషయంలో కొన్ని కాలిక్యులేషన్స్ ఫాలో అవుతుంటాడు బాలకృష్ణ. కొన్ని జానర్స్ కు వీళ్లు మాత్రమే న్యాయం చేయగలుగుతారని నమ్ముతుంటాడు. ఈ లెక్కలతోనే ఆదిత్య999 ని పట్టాలెక్కిస్తున్నాడు బాలయ్య.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఆదిత్య 369. భూత భవిష్యత్ కాలాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే మెమరబుల్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో బాలయ్య శ్రీకృష్ణ దేవరాయల గెటప్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
సింగీతం శ్రీనివాసరావు కొన్నాళ్లుగా సినిమాలు తీయడం లేదు. వెల్కమ్ ఒబామా తర్వాత పూర్తి విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే బాలకృష్ణ మాత్రం టెక్నికల్ మూవీ అంటే సింగీతం అనే డిసైడ్ అయ్యాడు. అందుకే ఆదిత్య369 సీక్వెల్ ను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోనే చేయాలనుకుంటున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను సినిమా తర్వాత ఆదిత్య 999ని మొదలు పెడతాడట బాలకృష్ణ.
అప్పట్లో ఆదిత్య369 సినిమా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఆ మూవీకి ప్రేక్షకుల ఆదరణ విశేషంగా దక్కింది. సినిమా థియేటర్ వైపు ఆడియన్స్ ను పరుగులు పెట్టించింది. ఇప్పుడు ఆదిత్య 369 సీక్వెల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు బాలయ్య.