జూనియర్ ఎన్టీఆర్ కి గుర్తింపు తెచ్చిన సినిమా ఇదే..?

Suma Kallamadi

తెలుగు వారి సత్తాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన నటుడు నందమూరి తారక రామారావు. అతని మనవడే జూనియర్ ఎన్టీఆర్ ఇది అందరికి తెలిసిన విషయం. జూనియర్ ఎన్టీఆర్ చిన్నవయసు నుండే తాతగారి నుండి నటనను పుణికి పుచ్చుకున్నాడు. కొందరు నటులు డాన్స్ చేస్తారు, కొందరు డైలాగ్స్ డెలివరీలో బెస్ట్ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. అతను ఒక గొప్ప నటుడు, డాన్సర్, సింగర్ మరియు డైలాగ్స్ డెలివరీలో చెప్పనవసరం లేదు.  అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు. 


తాతగారు ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్న తారక్ స్టార్ హీరోగా ఎదిగి ఆయన వారసత్వాన్ని నిలబెట్టాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాల తక్కువ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని 2001లో రామోజీ రావ్ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కింది. ఐతే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

 

రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ సాధించింది. హీరోగా ఎన్టీఆర్ ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తదుపరి మూడవ చిత్రంగా సుబ్బు విడుదల కాగా అది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఐతే ఎన్టీఆర్ భారీ స్టార్ డమ్ తెచ్చిన చిత్రం ఆది. మాస్ డైరెక్టర్  వి వి వినాయక్ ఈ చిత్రాన్ని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించాడు.

 

 వినాయక్ కి అది ఫస్ట్ మూవీ కాగా ఎన్టీఆర్ కి నాలుగవ చిత్రం. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆది అతనికి విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ మూవీ విజయం తరువాత ఎన్టీఆర్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుండగా వి వి వినాయక్ కుర్ర హీరో తారక్ తో మూవీ తీసి భారీ హిట్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: