హెరాల్డ్ స్పెషల్ MAY 2020: కిల్ ఫేక్ న్యూస్.. విజయ్ పిలుపుతో కదిలిన చిత్రపరిశ్రమ..!

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి నెలా ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారిపోతు  ఎన్నో రోజుల పాటు చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా ఈ మే నెల లో హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఏది అంటే విజయ్ దేవరకొండ అంశం. విజయ్ దేవరకొండ ఒక గాసిప్  మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో ఆ గాసిప్  మీడియాలోని ఒక జర్నలిస్ట్... ఏకంగా విజయ్ దేవరకొండ ను  నెగటివ్ చేసేలా కొన్ని వార్తలు ప్రచురితం చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ పేదలకు సాయం చేస్తానని ఆశలు కల్పించి కేవలం కొంతమందికి మాత్రమే సహాయం చేస్తున్నాడు అని.. అంతే కాకుండా టాలీవుడ్ పెద్దగా ఉన్న చిరంజీవి ఏర్పాటు చేశారు సిసిసి అనే కార్యక్రమంలో భాగస్వామ్యం కాకుండా దేవరకొండ అని ఒక ప్రత్యేక ట్రస్ట్  పెట్టి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు అంటూ వార్తలు ప్రచురితమయ్యాయి. 

 


 అయితే గతంలో కూడా పలువురు హీరోలపై ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ మనకెందుకులే అని ఊరుకున్నారు.  కాని విజయ్ దేవరకొండ మాత్రం సదరు గాసిప్  మీడియాకి గట్టిగానే క్లాస్ తీసుకుని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మా మీద వార్తలు రాసుకుని డబ్బులు సంపాదించే మీరు మళ్లీ ఇప్పుడు మమ్మల్ని తప్పుగా చూపెట్టడానికి ప్రయత్నిస్తారా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా నా ఇష్టం ఉన్నప్పుడు నేను సహాయం చేస్తాను..నాకు ఎలా కుదిరితే అలా చేస్తాను...  నాకు సహాయం చేయాలా వద్దు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించాడు.... ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయడం సిగ్గుచేటు విజయ్ దేవరకొండ సదరు గా గాసిప్  మీడియాను ఏకిపారేసాడు. 

 


 ఇదే సమయంలో విజయ్ దేవరకొండ కి టాలీవుడ్ ప్రముఖులు అందరు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ అంటూ టాలీవుడ్ ప్రముఖులు అందరు ఒక్క తాటిపైకి వచ్చారు. టాలీవుడ్ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు హీరోలు సైతం విజయ్ దేవరకొండ కు మద్దతు తెలిపారు.కిల్  ఫేక్ న్యూస్ అంశం కొన్ని రోజులపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సదరు గాసిప్  మీడియా చేతులారా పరువు తీసుకున్నట్లు అయ్యింది . టాలీవుడ్లో మే నెలలో ఎక్కువ హాట్ టాపిక్ గా నిలిచిన అంశం ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: