నందమూరి తారకరామారావు సెంటిమెంట్ ను అనుసరిస్తున్న పవన్ !

Seetha Sailaja
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ఎన్టీఆర్‌ ఏర్పాటు చేశారు. తెలుగు దేశం పార్టీని స్థాపించిన 9 నెలలలోనే ఢిల్లీ పీఠాన్ని గజగజ లాడించిన నందమూరి తారక రామారావు అధ్యాయం ఒక చరిత్ర. ఇప్పుడు అదే తేదీ పై పవన్ కళ్యాణ్ మనసు పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి. పవన్ మీడియా సమావేశం మార్చి 14న జరిగినా పవన్ పొలిటికల్ ఎంట్రీకి సంభందించిన పబ్లిక్ మీటింగ్ కు 29వ తేదిని ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేరోజు పవన్ తన పార్టీ పూర్తి స్ట్రక్చర్ ని ప్రకటిస్తాడని అంటున్నారు.  ‘సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు’ అంటూ తెలుగుదేశం పార్టీ పుడితే ‘పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం’ పవన్ రాజకీయాలలోకి వస్తున్నాడు. పవన్ జాతక రీత్యా మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ కు సంఖ్యా రీత్యా రాబోతున్న మార్చ్ 29 పవన్ కు కలిసి వస్తుందని కొంత మంది జ్యోతిష్కులు సూచించడంతో పవన్ నందమూరికి అచ్చి వచ్చిన తేది గురించి ఆలోచిస్తున్నాడు అని అంటున్నారు. ఈ వార్తల నేపెధ్యంలో రేపు జరగబోతున్న పవన్ మీడియా సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానుల సంఘాల నుండి సుమారు 2000మంది ప్రతినిధులు రాబోతున్నారని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: