2021 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఇవే.. !
2021 సంక్రాంతి గురించి మన హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏదేదో ఊహించుకున్నారు. ఈ లోగా కరోనా ఎంట్రీతో అందరి కలలు చెల్లాచెదురైపోయాయి. 2021 సంక్రాంతికి ప్లాన్ చేసిన కొందరు హీరోలు తప్పుకోగా.. ఎక్స్ పెక్ట్ చేయని ఇద్దరు హీరోలు వస్తున్నారు.
అల వైకుంఠపురములో రిజల్ట్ తో బన్నీకి సంక్రాంతి ఇష్టమైన పండుగ అయిపోయింది. సుకుమార్ సినిమా పుష్ప రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ లో స్టార్ట్ చేసిి.. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ కరోనా అడ్డంకింగా మారిపోయింది. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఒకవేళ రెండు మూడు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టినా.. సినిమా రిలీజ్ కావాలంటే 2021 వేసవి వెయిట్ చేయక తప్పదు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం సంక్రాంతికే రావాలనుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తే.. కరోనా మరోలా ప్లాన్ చేసింది. సినిమా ఎపుడు మొదలవుతుందో తెలియడం లేదు.
సంక్రాంతిపై మన హీరోలు వేసిన కర్చీఫ్ లను రాజమౌళి తీసేశాడు. జూలై 31న రావాల్సిన ఆర్ఆర్ఆర్ ను 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దర్శకధీరుడికి ఎదురెళ్లడం ఇష్టం లేక.. స్టార్స్ వెనక్కితగ్గి మరో డేట్ చూసుకోవాలనుకున్నారు. అయితే కరోనా రాకతో జనవరి 8న రావాల్సిన ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడుతోంది.
రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అణాత్త సినిమా చేస్తున్నాడు. సినిమాను ముందుగా దీపావళికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కరోనా ఎఫెక్ట్ తో సంక్రాంతి వస్తోందని తెలుస్తోంది.
కరోనా లేకుంటే.. చిరంజీవి ఆచార్య దసరా బరిలో దిగేది. ఇప్పటికింకా సగం షూటింగ్ పూర్తి చేసుకోని ఆచార్య.. సంక్రాంతికి వద్దామనుకుంటున్నాడు. రాబోయే వచ్చే సంక్రాంతి సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్ గా మారుతోంది. మొత్తానికి కరోనా అందరి కలలు చెరిపేసింది. కొందరిలో ఆశలు పుట్టిస్తోంది.