సల్మాన్ ఖాన్ రొమాంటిక్ ట్విస్ట్... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..?
దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌట్ విధించింది. ఈ సమయంలో అన్ని సినిమా షూటింగులు నిలిచిపోవడంతో సినీ ప్రముఖులందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సినీ ప్రముఖులు ప్రస్తుతం ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారు. ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా సల్మాన్ ఖాన్ ఇలాంటి ఒక కొత్త ప్రయత్నమే చేశారు. ఏకంగా తనే స్వయంగా దర్శకత్వం వహించి ఒక పాటను చిత్రీకరించారు సల్మాన్ ఖాన్.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సల్మాన్ ఖాన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ తెర బిన అనే ఒక ఈ పాటను ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది సూపర్ స్టార్ ఫామ్ హౌస్ సమీపంలోనే చిత్రీకరించారు. దీనికి దర్శకత్వం కూడా సల్మాన్‌ఖాన్ వహించారు. ఇక పాటలో సల్మాన్ ఖాన్ జాక్విలిన్ ఫెర్నాండజ్ మధ్య ఉన్న ప్రేమ కథ తెలియజేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక గుడారంలో నివసించడం.. గుర్రపు స్వారీ చేస్తుండడం... లాంగ్ డ్రైవ్ కి వెళుతుండటం వీరి మధ్య ప్రేమను తెలియజేస్తూ ఉంటుంది.
ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగేసి ఆకర్షిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ లాక్ డౌన్ సమయంలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ కూడా తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేశారు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నిమిషాల వీడియో తో ఏకంగా సల్మాన్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. వీడియోలో సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మధ్య అనుబంధం ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నటించాను.
#TereBina: #SalmanKhan-#JacquelineFernandez show their lockdown activities with romantic twist in new music video@BeingSalmanKhan @Asli_Jacqueline #TereBinaSongOutToday https://t.co/J4EkY0ynpR — dna (@dna) May 12, 2020