ఎన్టీఆర్ కోసం శాలిని ఏం చేసిందో చూడండి.. సూపర్ కదా..
తారక్ కి ఆయన కెరీర్ లో తల్లి ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటూ ఉంటారు అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు. అతను అసలు వ్యాపారం చేసుకుందాం లేదా విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకుందామని భావించారట. తండ్రి హరికృష్ణ మద్దతు కూడా తొలి రోజుల్లో ఉండేది కాదని కాని ఆ తర్వాత అతని తల్లి శాలిని అతనికి అండగా నిలబడటమే కాదు అగ్ర దర్శకులతో అతని గురించి మాట్లాడి అవకాశాలు ఇవ్వాలని కోరే వారట. ఇక కథలను ఆమె స్వయంగా విని ఎన్టీఆర్ కి సినిమాలను ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయని అంటూ ఉంటారు.
ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు అయితే అతని ప్రతీ సినిమా కథ కూడా ఇప్పటికి తల్లి శాలిని వింటూ ఉంటారని ఆమె కథ విన్న తర్వాతే అతను సినిమాను ఓకే చేసే వాడు అని అంటున్నారు. ఇప్పటికి కూడా అతని సినిమాల గురించి అన్ని విషయాలను ఆమె పట్టించుకుంటూ ఉంటారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది..ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు..