విజయ్ కి రోజురోజుకు మద్దతు భారీగా పెరుగుతోందిగా.....??
యువ హీరో విజయ్ దేవరకొండ రీల్ పైన మాత్రమే కాక, రియల్ గా కూడా మంచి మనసున్న హీరోగా పేరు సంపాదిస్తూ ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు. మన దేశం మొత్తం కూడా కరోనా వ్యాధి నేపథ్యంలో కొద్దిరోజులుగా లాక్ డౌన్ అమలవుతుండడంతో అన్ని రంగాలు పూర్తిగా మూసివేయబడడంతో ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లలో ఉండిపోవడం జరిగింది. దానితో ఎందరో పేద ప్రజలు తిండి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. కాగా అటువంటి వారికోసం ప్రభుత్వాలతో పాటు మేము కూడా ఉన్నాము అంటూ ఇప్పటికే అనేక రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంతమేరకు విరాళాలు అందిచడం జరిగింది.
కాగా టాలీవుడ్ లోని పలువురు ఇతర నటులతో పాటు, విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే రూ.1.30 కోట్ల విరాళాన్ని ప్రకటించడం తో పాటు మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో తన టీమ్ కొందరితో కలిసి ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి పలువురు ప్రజల నుండి విరాళాలు సేకరిస్తూ, వాటిని అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు నియోగిస్తూ మంచి మనసున్న హీరోగా పేరు సంపాదించాడు. అయితే అతడు సేకరిస్తున్న విరాళాలు, చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఒక వెబ్ సైట్ ఫేక్ న్యూస్ ప్రచురించడంతో, నిన్న ఆ న్యూస్ ని ఖండించిన విజయ్, ఒక వీడియో పోస్ట్ చేసాడు. తనకు వీలైనంత సాయాన్ని చేద్దాం అనే ప్రయత్నంతో చేపట్టిన ఈ బృహత్కార్యంలో ఎందరో ప్రజలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తుంటే, మా సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఈ విధంగా తప్పుడు వార్తలు రాయడం తగదని తన వీడియోలో విజయ్ ఆవేదన వ్యక్తం చేసారు.
కాగా విజయ్ పోస్ట్ చేసిన వీడియోని చూసి మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ, ఇటువంటి తప్పుడు వార్తలు రాయడం పై మండిపడుతూ విజయ్ కు అండగా నిలుస్తానంటూ ఒక పోస్ట్ చేసారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు విజయ్ కు ఈ విషయమై తోడుగా ఉంటాం అంటూ రోజురోజుకు భారీగా మద్దతు పలుకుతున్నారు. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి, ఇకపై ఇటువంటి తప్పుడు వార్తలు రాసే వారిపై టాలీవుడ్ ఇండస్ట్రీ గట్టిగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది......!!