బుల్లితెర బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రాజమౌళి !

Seetha Sailaja
బుల్లితెర ప్రభావంతో సినిమాలు కూడా గజగజ లాడుతున్న పరిస్థితి ఈనాడు. టివిలకు జనం హత్తుకు పోవడంతో భారీ సినిమాలకు కూడా ప్రేక్షకులను రప్పించలేని స్థితిలో నేటి సినిమా రంగం ఉంది. ఈనేపధ్యంలో చాలా మంది టివి సీరియల్స్ నిర్మాతలు తమ సీరియల్స్ కు క్రేజ్ మరింత పెంచు కోవడం కోసం ఫిలిం సెలిబ్రిటీల ఇమేజ్ వాడుకుంటున్నారు. ఈ వ్యవహారానికి అనుగుణంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ఈటీవీ త్వరలో ప్రసారం కానున్న మేఘమాల సీరియల్ ప్రమోషన్ కి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆయన వీడియో బైట్ ని ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమా అనేది రంగుల ప్రపంచం చాలా కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తోంది ‘మేఘమాల’ సినిమాలతో సమానంగా ఈ సీరియల్ లో ట్విస్ట్ లు ఉన్నాయి అన్నారు. అంతే కాదు ఈటీవిలో వస్తున్న ఈ సీరియల్ అందరికి నచ్చుతుందని కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. రాజమౌళితో పాటు ఈ సీరియల్ కోసం దగ్గుపాటి రానా కూడా ప్రమోట్ చేయడం విశేషం.  ప్రస్తుతం మన తెలుగు తెర జక్కన్న ‘బాహుబలి’ లో బిజీగా ఉంటూ కూడా టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాలను అలాగే బుల్లితెర సీరియల్స్ ను ప్రమోట్ చేయడం రాజమౌళి నిరాడంబరతకు నిదర్సనం అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: