కరోనా సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ సంసారంలో చిచ్చురేపుతున్న చిరంజీవి పనులు !
మెగా స్టార్ చిరంజీవి వివాదాలకు చాల దూరంగా ఉంటాడు. మంచి అయితే ఓపెన్ గా చెడు ఏదైనా అయితే చెవిలో రహస్యంగా చెప్పాలి అంటు చిరంజీవి తన సిద్ధాంతాన్ని ఓపెన్ గానే వివరించాడు. అలాంటి చిరంజీవి ప్రవర్తన వల్ల తన సంసారంలో చిచ్చు రేగుతోంది అంటూ స్టార్ ప్రొడ్యూసర్ ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ చేసిన కామెంట్స్ చాలామందికి షాక్ ఇచ్చాయి.
లాక్ డౌన్ సమయంలో సెలెబ్రెటీలు అంతా తమ ఇళ్ళల్లో ఆనందంగా కాలం గడుపుతూ ఒకరి పై ఒకరు ఛాలెంజ్ లు విసురుకుంటూ లాక్ డౌన్ పిరియడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా మహిళల చేత ఇంటి పనులు చేయించకండి అంటూ ‘బీ ద రియల్ మేన్’ అనే నినాదంతో మగవారికి ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన సెలెబ్రెటీలు అంతా ఒకరికొకరు సవాల్ విసురుకుంటున్న పరిస్థితులలో చిరంజీవి తన ఇంటి పనులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిఈ ఛాలెంజ్‌కు కేటీఆర్ రజినీకాంత్ మణిరత్నం వంటి ప్రముఖలకు నామినేట్ చేశాడు.
ముఖ్యంగా చిరంజీవి షేర్ చేసిన వీడియోలో అతడు దోసె వేసిన తీరు చాలామందిని ఆకర్షిస్తూ ఆ వీడియో ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు ఆ వీడియో పై పొట్లూరి వరప్రసాద్ చాల విభిన్నంగా స్పందించారు. చిరంజీవి వల్ల తన భార్యతో తనకు సమస్యలు వస్తున్నాయి అంటూ పొట్లూరి సరదాగా చేసిన జోక్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలం, గచ్చు కడగగలం కానీ మీరిలా స్టార్ హోటల్ చెఫ్ లా నలభీమ పాకం వండుతుంటే, మా ఆవిడ మెగాస్టార్ చేయగాలేనిది, మీకేమిటి అంటున్నారు. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు. మీ నిరంతర ప్రేరణ ప్రశంసనీయం సర్’ అంటూ పీవీపీ చేసిన కామెంట్స్ ఈ కరోనా సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాల షూటింగ్ లు లేకపోయినా సెలెబ్రెటీలు అంతా ఇలా తమకు తాముగా బిజీగా ఉంటూ మీడియాలో తమ ఉనికి కోల్పోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్ కి అల్లు అర్జున్ ప్రభాస్ లు కూడ నామినేట్ కావడంతో వారు ఇంటిపనులు ఎలా చేస్తారా అన్న ఆసక్తితో వారి దగ్గర నుండి వీడియోలు కోసం అందరు ఎదురు చూస్తున్నారు..