మహేష్ ను సైడ్ లైన్ చేస్తున్న టాప్ హీరోలు !

Seetha Sailaja

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోంది. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తామంతా ఇంటిపనులు చేస్తున్నాము అంటూ షేర్ చేస్తున్న వీడియోల హంగామా కొనసాగుతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ఈఛాలెంజ్ ఇప్పుడు స్టార్ హీరోల వరకూ వెళ్లిపోవడంతో తామంతా తమ భార్యలకు ఎలా సహాయపడుతున్నామో వివరిస్తూ ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ కి మంచి క్రేజ్ ను తీసుకువస్తున్నారు.  


ఈనేపద్యంలో రాజమౌళి  విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఇదే రకమైన ఛాలెంజ్ ని టాప్ హీరోలకు విసిరిన జూనియర్ తన ఛాలెంజ్ లిస్టులో అందరి హీరోల పేర్లు ప్రస్తావించి మహేష్ పేరును ఎందుకు ప్రస్తావించలేదు అంటూ మహేష్ అభిమానులు ఒక కొత్త వితండ వాదాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. జూనియర్ మహేష్ లకు మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా తారక్ మహేష్ ను ‘అన్న’ అంటూ చాల అభిమానంగా పిలుస్తాడు. 


‘భరత్ అనే నేను’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన జూనియర్ తనకు మహేష్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి ఓపెన్ గా చెప్పి మహేష్ అభిమానులకు జోష్ ను కలిగించాడు. అదేవిధంగా రామ్ చరణ్ కూడ మహేష్ తో బాగా సన్నిహితంగా ఉంటాడు. చరణ్ భార్య ఉపాసన నమ్రతలు కూడ మంచి స్నేహితులు అయితే చరణ్ విసిరిన ‘బీ ద రియల్ మెన్’ ఛాలెంజ్ లిస్టులో కూడ మహేష్ పేరు లేకుండా రానా దగ్గుబాటి శర్వానంద్ లకు సవాల్ విసిరాడు. ఇలా సందీప్ వంగా  రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ లు షేర్ చేసిన వీడియో ఛాలెంజ్ లో చాలామంది పేర్లు ఉన్నాయి కాని ఎవరూ మహేష్ ను నామినేట్ చేయకపోవడం మహేష్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 


ఇప్పుడు ఇదేవిషయం పై సోషల్ మీడియాలో చర్చలు కూడ జరుగుతున్నాయి. మరికొందరైతే ఈవిషయానికి వేరే నెగిటివ్ కోణంలో చూస్తూ మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఈర్ష్య అని ఈవిషయం మరొకసారి రుజువు చేసింది అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివలలో కొరటాల కూడ ఈఛాలెంజ్ కి మహేష్ ను నామినేట్ చేయకుండా విజయ్ దేవరకొండను నామినేట్ చేసాడు. దీనితో ఇక చిరంజీవి ఛాలెంజ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో మహేష్ ఇంటిపని వంటపని ఎలా చేస్తున్నాడు అని చూడాలని ముచ్చట పడుతున్న అతడి అభిమానుల కోరికను చిరంజీవి తీరుస్తాడో లేదో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: