పూర్తిగా హెయిర్ స్టైలిస్ట్ గా మారిన అనుష్క శర్మ ...!
మామూలుగా బిజీ జీవితం గడిపే మనుషులకు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరకదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే... ఆ సమయం అసలు ఉండదనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కలిసిన హాయ్ బాయ్ అనుకుంటూ వారిని జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఈ కరోనా వైరస్ పుణ్యమా అని వారందరూ ఇప్పుడు కలిసిమెలిసి ఒకే ఇంట్లో జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలా ఎవరి వాళ్ళ ఇంట్లో ఉంటూ వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా అల్లరి చేస్తూ వారి జీవితానికి భిన్నంగా రోజుల్ని సెల్ఫ్ క్వారంటైన్ ని పాటిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
auto 12px; width: 50px;">View this post on InstagramMeanwhile, in quarantine.. 💇🏻♂💁🏻♀ A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
ఈ సమయంలో సెలబ్రిటీలు చాలామంది వారి ఖాళీ సమయాల్లో ఆన్లైన్ లోకి వచ్చి వాళ్ళ అభిమానుల్ని పలకరిస్తూ వారికి నచ్చిన విధంగా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. అయితే తాజాగా సెలబ్రిటీ కపుల్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ ఫన్నీ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి వీరు లాక్ డౌన్ ప్రకటించక ముందే ఇద్దరు హోమ్ లోకి వెళ్ళిపోయారు.
అయితే వీరిద్దరూ విదేశాల నుంచి రావడంతో తగు జాగ్రత్తలతో ఇంటికే పరిమితమయ్యారు. గత పది రోజుల నుంచి క్వారంటైన్ టైంలో ఉన్న వీరిద్దరూ సరదాగా కాలాన్ని హాయిగా గడిపేస్తుంటారు. ఈ సమయంలో తాజాగా విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ హెయిర్ స్టైల్ చేస్తూ టైం పాస్ చేస్తుంది. నిజానికి అనుష్క శర్మ ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ మాదిరిగా విరాట్ కోహ్లీకి హెయిర్ కట్ చేసింది.
ఆ తరువాత ఇంస్టాగ్రామ్ లో అనుష్క శర్మ ఆ వీడియోకి కటింగ్ కి ముందు కటింగ్ తర్వాత అని పోస్ట్ చేసింది. ఇలా విడుదల చేసిన వీడియో వారి అభిమానులు ఏకంగా 5 మిలియన్ వ్యూస్ ని సాధించడం విశేషం. ఇలా నిజానికి ఎవరికి వారు వారి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ బయటకు రాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాలని కోరుతున్నాము.