కరోనా ప్రళయం వేళ ఆ హీరో బోర్డర్లో ఎంజాయ్ చేస్తున్నాడుగా...!
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎక్కడి వారు అక్కడ లాక్ అయిపోతున్నారు. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం ఇళ్లలోనే ఉంటున్నారు. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్లు బంద్ అయ్యాయి. ఇక హీరోలు సైతం సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇక చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇళ్లల్లోనే ఉంటూ వంటలు వండుతుండడమో లేదా వీడియోలు చేసి తమ అభిమానులను ఆనంద పరచడమో ? చేస్తున్నారు.
అయితే కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ మాత్రం శ్రీనగర్ బోర్డర్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా శ్రీనగర్ లో మూడో రోజు కొత్త ముఖాలు.. కొత్త ప్రదేశాలు అంటూ కొన్ని కాల్వలు, నదలు పక్కన దిగిన ఫొటోలతో పాటు అక్కడ స్తానికులతో దిగిన ఫొటోల వీడియోను షేర్ చేశాడు. మొత్తానికి ప్రపంచం అంతా కరోనా దెబ్బతో విలవిల్లాడుతున్నా సుదీప్ ఎంజాయ్ మాత్రం మామూలుగా లేదు.