మీ వెంటే మేముంటాం.. సీఎం కేసీఆర్ ని తెగపొగిడేశారు బండ్ల గణేష్
దేశంలో కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా కరోనా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజు రోజు కీ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించే విషయం గురించి నిన్న మాట్లాడారు. ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ విషయంపై స్పందంచిన బండ్ల గణేష్ తెలంగాణ డైనమిక్ సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, కరోనా నియంత్రణకు కేసీఆర్ తీసుకునే ఎటువంటి చర్యకైనా ప్రజల నుంచి మద్దతు ఉంటుందని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు.
మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు" అని ఆయన వ్యాఖ్యానించారు. "నాలుగు రోజులు కాదుసార్ మీ మీద నమ్మకంతో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్ల కే పరిమితం అవుతూ విజయం సాధిస్తాం" అని ట్వీట్ చేశారు.
"మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.." అని, "ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటూ.." అని బండ్ల గణేశ్ ట్వీట్ పెట్టారు.
మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు@TelanganaCMO — BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
నాలుగు రోజులు కాదుసార్ మీద నమ్మకం తో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్ల కే పరిమితం అవుతోంది విజయం సాధిస్తాం జై కేసీఆర్@TelanganaCMO — BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బండ్ల గణేష్@TelanganaCMO — BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు@TelanganaCMO — BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం మాకు మీరు ఉన్నారని భరోసా మీరు ఉన్నారనే ధైర్యం మీరు రక్షిస్తారు నమ్మకం జై కేసీఆర్@TelanganaCMO — BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020