మహేష్, ఎన్టీఆర్, చరణ్.... వీరిలో ఎవరి భార్యకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయంటే....??
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్లు గా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లలో ముందుగా టాలీవుడ్ కి హీరోగా 1999లో ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్. ఆయన మొదటి సినిమా రాజకుమారుడు అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని, తొలిసినిమాతోనే మహేష్ కు ఎంతో గొప్ప పేరు తెచ్చింది. ఇక ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ, మధ్యలో మంచి విజయాలు అందుకుంటూ హీరోగా ఎందరో అభిమానులను సంపాదించారు మహేష్. ఇక 2002లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఇక ఆ తరువాత నుండి వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని, హీరోగా మంచి విజయాలు అందుకుంటూ నేడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు ఎన్టీఆర్.
అలానే 2007లో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఫస్ట్ మూవీ తో మంచి సక్సెస్ ని అందుకుని, అక్కడి నుండి పలు విజయాలతో నేడు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇక వీరిలో మహేష్ బాబు నమ్రతను, ఎన్టీఆర్ ప్రణతిని, రామ్ చరణ్ ఉపాసనను వివాహాలు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ముగ్గరు హీరోల భార్యలు కూడా ఎంతో గొప్ప పేరు, ఆస్థిపాస్తులున్న కుటుంబాల నుండి వచ్చిన వారు కావడం విశేషం. ముందుగా మహేష్ భార్య అయిన నమ్రత, మహారాష్ట్రకు చెందిన ఒక బడా ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి అని, ఆమెకు పెళ్లి అనంతరం భారీ స్థాయిలోనే ఆస్తులు సంక్రమించినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ భార్య ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలానే వారికి ఒక మీడియా ఛానల్ కూడా ఉండడంతో ఆమె కూడా భారీ స్థాయిలోనే ఆస్తులు తీసుకువచ్చినట్లు చెప్తున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ భార్య ఉపాసన, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు కావడంతో ఆమె కూడా భారీ స్థాయిలోనే ఆస్తులు తీసుకువచ్చిందని, ఒకరకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు హీరోల భార్యలు కూడా తమ మెట్టినింటికి భారీ రేంజ్ లోనే ఆస్తులు తీసుకువచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఎంత బాగా ఆస్తులు కలిగి ఉండి, ఎంతో గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువగా సాధారణంగా జీవించడానికే ఇష్టపడుతుంటారని, అలానే వారి భర్తలు అంత ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా తమ తోటివారి పట్ల ఎంతో ఒదిగిపోయి మంచిమనసుతో వ్యవహరిస్తున్నందువల్లనే, దేవుని కృప కూడా లభించి, వారికి అటువంటి స్థాయి లభించిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!