హెరాల్డ్ స్పెషల్ MAR 2020 : జాగ్రత్తలు చెబుతారే కానీ జేబులోంచి చిల్లిగవ్వ తీయరు..!

Suma Kallamadi

దేవుని తర్వాత మనం సినీ హీరోలనే దేవుళ్ళు గా కొలుస్తాం. వారి సినిమాలు విడుదలైతే చాలు... అభిమానులు ఎగేసుకుంటూ థియేటర్లకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని మరీ టికెట్ కొని చూస్తుంటారు. అది ఎంత చెత్త సినిమాల అయినా సూపర్ హిట్టు బంపర్ హిట్టు అంటూ ఆ చెత్త సినిమాలను కూడా పదిమంది చూసేలా చేసి ఒట్టి పుణ్యానికే వారి మీద డబ్బులు వెదజల్లుతుంటారు పిచ్చి ప్రేక్షకులు. మన ప్రజల ఆదరణ లేకపోతే మెగాస్టార్, సూపర్ స్టార్ లాగా పిలవబడే హీరోలు ఎక్కడ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నిజాన్ని సాక్షాత్తు హీరోలే అనేక సందర్భాల్లో చెబుతూ భావోధ్యేగానికి గురవుతుంటారు. నిజానికి వారి సహాయాన్ని మాటల వరకే పరిమితం చేస్తారు కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం ఎవరి కంటికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్తుంటారు.


ప్రజల ఆదరణ తోనే కోట్లకు కోట్లు సంపాదించిన వీళ్ళకి అదే ప్రజలు ఆపదలో ఉంటే పైసా ఖర్చు చేయడానికి కూడా మనసు రాదు. అలా అని అందరూ హీరోలు మంచి వాళ్ళు కాదని మేము చెప్పట్లేదు. ఉదాహరణకి అక్షయ్ కుమార్ నే తీసుకోండి... ప్రధానమంత్రి ఫండ్ కి ఏకంగా 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. దాంతో షాకయిన తన భార్య... ' ఏంటండి, ఇదీ? మీరు అన్ని కోట్ల రూపాయలను ఆలోచించే ఇస్తున్నారా? అని అడిగిందట. దాంతో అక్షయ్ కుమార్ సమాధానమిస్తూ... 'గతంలో నాకు ఏమీ లేదు. ఇప్పుడు నా వద్ద ఉన్న ధనం మొత్తం ప్రజలదే. ప్రజలిచ్చిన ధనాన్ని వారి అత్యవసరాలకే ఇచ్చేస్తున్నాను. ఏం, నేను జనాలకేమివ్వద్దా?' అని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన భర్త యొక్క గొప్ప స్వభావానికి గర్వంగా ఫీల్ అయ్యింది ట్వింకిల్ ఖన్నా. బాలీవుడ్ హీరో ఒకే ఒక్కడు 25 కోట్లు విరాళం ఇస్తే మన టాలీవుడ్ సినీ హీరోలు అంతా కలిపి కనీసం 15 కోట్లు కూడా ఇవ్వకపోవడం బాధాకరం.



అక్షయ్ కుమార్ ని మినహాయించి కొంతమంది బాలీవుడ్ హీరోలు ఎవరికీ తెలియకుండా ఎన్నో ఛారిటీలు చేస్తుంటారు. అంతెందుకు ఒక లేడీ యాక్టర్ అనుష్క శర్మ ఏకంగా 5 కోట్ల రూపాయలను కోవిడ్ 19 బాధితుల కోసం దానం చేసి తన గొప్ప స్వభావాన్ని చాటుకున్నారు. చివరిగా ఒక మాట.. ప్రజలు ఆపదలో ఉంటే ముందుకు వచ్చి ఆదుకునే వాడే నిజమైన హీరో. అటువంటి మనస్తత్వం లేకుండా ప్రజల నుండి ధనం దోచుకొని దాచుకొనే ఎంత బడా స్టార్ అయినా ఈ భూమ్మీద చెత్త తో సమానమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: