ఇది యాక్షన్ సినిమా కాదే...జిఎస్టి2 లాగా అనిపిస్తుంది వర్మ...ఎక్కితొక్కేస్తదేమో?
భారత్‌లోనే పూర్తి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెరకెక్కుతోన్నఈ చిత్రం. ఆ నేపధ్యంలో ఉండే తొలి సినిమా ఎంటర్ ది గాళ్ డ్రాగన్ అని అంటున్నారు ఆర్జీవీ. అంతా ఒకటైపు.. నేనొక టైపు అనిపించుకునే వర్మ మార్షల్ ఆర్ట్స్‌కు గ్లామర్‌ను మేళవించి చేస్తోన్న సరికొత్త ప్రయోగమిది. ఇక ఈయన చిత్రాల్లో గ్లామర్ లేకుండా ఉండడం అనేది ఉండదు.
ఇండో చైనీస్ సంయుక్త నిర్మిస్తున్న ఈ చిత్రం ఆర్జీవీ -ఎంటర్ ది గాళ్ డ్రాగన్‌లో టైటిల్ రోల్‌ను పూజా భలేకర్ పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ప్రాజెక్టులో -పూజా చేసిన రిస్కీ ఫైట్స్ ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఇక ఈ యాక్షన్స్ సీన్స్ మాటెమోగానీ, ఆర్జీవీ రిలీజ్ చేసిన పిక్స్‌లో పూజ అందాలు మాత్రం ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇది యాక్షన్ సినిమాలా లేదు మరో జిఎస్టిలాగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. గతంలో చైనాలోనూ మేజర్ షెడ్యూల్ జరుపుకున్న చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ బీచ్‌లో జరుపుకుంటోంది. ఇ ఈచిత్రం జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ మాత్రం హిట్ కొడుతుందో తెర మీదే చూడాలి.