టాప్ హీరో మోసం పై యువ రచయిత గగ్గోలు !

Seetha Sailaja
హీరో వెంకటేష్ తనను మోసం చేసాడు అంటు ఒక రచయిత తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిరియాదు చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంసంగా మారింది. గత వారం వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రారంభమైన ‘రాధా’ సినిమాకు సంబంధించిన వ్యవహారం ఇది. సామాన్యంగా వెంకటేష్ వివాదాలకు చాల దూరంగా ఉంటాడు, అటువంటి వ్యక్తి పై ఒక యువ రచయిత ఈ అభాండం మోపడం సంచలనంగా మారింది. భాగ్యనగరంలో సినిమా రచయితగా ఎదుగుదామని సురేంద్ర కృష్ణ అనే రచయిత ఒక వెరైటీ లవ్ స్టోరీని తయారు చేసుకుని వెంకీని కలవడం జరిగిందట, ఈ కధలో ఒక రాజకీయ నాయకుడు ఒక మధ్య తరగతి అమ్మాయిని ప్రేమించే కధ. ఈకధ వెంకటేష్ కు బాగా నచ్చడంతో రచయిత సురేంద్ర కృష్ణను ఈకధను బాగా డెవలప్ చేసి పట్టుకురమ్మని చెప్పాడట. ఈలోపున మారుతి వెంకటేష్ తో ఒక సినిమా తీయడానికి వెంకీతో కధా చర్చలు జరుపుతున్న సమయంలో వెంకటేష్ సురేంద్ర కృష్ణ గతంలో తనకు చెప్పిన కధను మారుతికి వివరించి ఆ కధను డెవలప్ చేయమని మారుతికి చెప్పాడట వెంకీ.  అదే ‘రాధా’ సినిమాగా మారింది. ఈలోపున విషయం తెలుసుకుని సురేంద్ర కృష్ణ వెంకీ దగ్గరకు వచ్చేసరికే ‘రాధా’ సినిమా ప్రారంభం కూడా ఐపోయింది. దీనితో షాక్ కు గురైన రచయిత సురేంద్ర కృష్ణ తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిరియాదు చేసినా తన మాటకు ఎవరూ విలువ ఇవ్వడం లేదని, చివరికి ఈ సంస్థ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ కూడా వెంకీ, మారుతీల తరపునే సపోర్ట్ ఇస్తున్నాడని ఈ యువ రచయిత అభియోగం.  దీనితో చేసేది లేక వెంకటేష్ తనను మోసం చేసాడు అంటు ఈ రచయిత ఫిలిం నగర్ లో గగ్గోలు పెడుతున్నాడట. పాపం సినిమా ప్రపంచంలోని అసలు రంగు ఈయువ రచయితకు తెలిసినట్లు లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: