ఎంత మెగా హీరో అయితే మాత్రం అంత బడ్జెట్టా... అన్న బాటలోనే తమ్ముడు.. అయోమయంలో నిర్మాతలు..?

praveen

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్తో తెలుగు చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు వచ్చి తమ సత్తా చాటుతు  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో మెగా హీరోల ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో కొత్త గా మరో  మెగా హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యేందుకు  సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని సుప్రీం  హీరోగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్  తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

 

 

 ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవైపు మెగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమా కావడం... ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరించడం తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక దర్శక నిర్మాతలకు కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వచ్చింది. అయితే అంతా బాగానే ఉన్న సమయంలో ఈ సినిమా బడ్జెట్ మాత్రం నిర్మాతలను అయోమయంలో పడేసింది. ఎందుకంటే ఈ సినిమా రెమ్యూనరేషన్ కూడా పెద్దగా లేకుండా... చాలా చిన్న బడ్జెట్టు సినిమాను తెరకెక్కించాలని ముందుగా అనుకున్నారట. కానీ రెమ్యునరేషన్ విషయంలో ఎవరూ రాజీ పడకపోవడం... ఇక 2 కోట్లతో సినిమా తెరకెక్కించాలనుకొన్న సినిమాకు 22 కోట్ల బడ్జెట్ దాటిపోవడంతో సినిమా నిర్మాతలు అయోమయంలో పడ్డారు. 

 

 

 అంటే ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద 24 కోట్ల బిజినెస్ చేయడంతోపాటు 25 కోట్ల షేర్ రాబట్టాలి. అలా అయితేనే ఈ సినిమా ఖర్చుకు సరైన న్యాయం జరిగినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే గతంలో సాయిధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయిన రేయ్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ సినిమా విడుదలై పర్వాలేదనిపించినా నిర్మాతలకు మాత్రం నష్టాలనే మిగిల్చింది. ప్రస్తుతం సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరుగుతుంద అనే అయోమయంలో ఉన్నారు నిర్మాతలు. ఇక ప్రస్తుతం సినిమాలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ కూడా ఉండడం వల్ల.. ఈ సినిమాకు ఇది ఒక మైనస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ఏదేమైనా ఎంత మెగా హీరో అయితే మాత్రం మొదటి సినిమాకే అంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: