ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత!
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ దర్శకులు, నిర్మాతలు కన్ను మూసిన విషయం తెలిసిందే. కొంత మంది అనారోగ్యంతో మృతి చెందితే.. మరికొంత మంది ప్రమాదాల వల్ల కన్ను మూశారు. తాజాగా బాలీవుడ్ సినియర్ నటులు, చిత్ర నిర్మాత ఇంతియాజ్ ఖాన్(77) కన్నుమూశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ కుమార్ తనయుడు షోలో చిత్రంలో గబ్బర్ సింగ్ గా ఫేమస్ అయిన అమ్ జత్ ఖాన్ సోదరుడు ఇంతియాజ్ ఖాన్.
అప్పట్లో పలు విలన్ పాత్రల్లో కూడా ఇంతియాజ్ ఖాన్ నటించి మెప్పించారు. ప్రముఖంగా హర్రర్ చిత్రాల్లో ఆయన విలన్ గా నటించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఇంతియాజ్ ఖాన్ కి భార్య కృతికా ఈమె ప్రముఖ రంగస్థల, సినీ నటి. ఆయనకు కుమార్తె అయేషా ఖాన్ ఉన్నారు. ఇంతియాజ్ ఖాన్ ‘యాదోంకి బారాత్’, ‘ధర్మాత్మ’, ‘దయావన్’, ‘హల్‌చల్’, ‘ప్యార్ దోస్త్’, ‘గ్యాంగ్’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా చేశారు. అప్పట్లో అంజాద్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఆయన సోదరుడిగా ఇంతియాజ్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన మృతికి బాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపాన్ని తెలియజేశారు. ఆయ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కాగా, బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ.. ఇంతియాజ్ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నటుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూశారు. అతనితో గ్యాంగ్ చిత్రంలో నటించాను. ఇంతియాజ్ ఖాన్ అద్భుతమైన నటుడు. మానవతావాది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు.