'ఆర్ఆర్ఆర్' మళ్ళీ వాయిదా పడనుందట....కారణం అదేనా....?

GVK Writings

ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని, విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని ముందుగా ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకున్నారు, అయితే సినిమాలోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కు మరికొంత సమయం పట్టడంతో వచ్చే ఏడాది జనవరి 8 కి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఆ డేట్ కు కూడా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని, ఆ డేట్ ని కూ వాయిదా వేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ కు తీసుకువెళ్లే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. 

 

కాగా దానికి ప్రధాన కారణం కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవడమే అని, ఇప్పటికే అనుకున్న విధంగా డిసెంబర్ సమయానికల్లా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయ్యే అవకాశం చాలావరకు లేదని, అందుకే మరొక్కమారు ఆలోచన చేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్, సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ కి వాయిదా వేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు నందమూరి ఫాన్స్ ఇద్దరికీ కూడా ఇది అతి పెద్ద చేదు వార్త అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: