తెలిసి తెలిసి.. ప్రభాస్ నిర్మాతలు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారే..?
బాహుబలి ఇలాంటి వరల్డ్ వైడ్ సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిన విషయం తెలిసిందే. బాహుబలి ముందు వరకు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచం నలుమూలల పాకి పోయింది. దీంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది. అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది అనే చెప్పాలి. అయితే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రభాస్ కి నిరాశే మిగిల్చింది. ఇక వసూళ్ళ పరంగా ఈ సినిమా సత్తా చాటిన.. టాక్ పరంగా మాత్రం భిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది సాహో మూవీ. సాహో విషయంలో ఎంతో కేర్ తీసుకుని ఏదో చేయాలని అనుకున్నప్పటికీ చివరికి ఏదో చేశారు ప్రభాస్ నిర్మాతలు.
ముఖ్యంగా సినిమా మొదలైనప్పుడు ఒక సంగీత దర్శకుని అనుకుని ఆ తర్వాత మళ్ళీ వారిని వద్దనుకుని... సహో పోస్టర్స్ లో సంగీత దర్శకుడిగా ఎవరి పేరు వేయకుండా నిర్మాతలు అప్పట్లో ఏదేదో చేసేసారు. దీంతో అసలు ఎవరు సాహో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు తెలియక ప్రేక్షకులు అయోమయంలో మునిగిపోయారు. దీంతో సాహో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ అంతగా క్లిక్ అవ్వలేదు. నిర్మాతలు ఆశించినంత స్థాయికి సాహో సినిమా పాటలు అభిమానుల్లో కి వెళ్లలేదు. అయితే సినిమా చూసేటప్పుడు విజువల్ గా బాగానే అనిపించాయి కానీ... మామూలుగా మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా యూట్యూబ్ లో మాత్రం మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి.
అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ నిర్మాతలు ఇలాంటి తప్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనేది ఇంతవరకు బయటకు రాలేదు. అసలు ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేస్తున్నారు అనేది మీడియా ప్రతినిధులకు కూడా తెలియని పరిస్థితి. ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని ఒకవేళ ఆడియన్స్ ని అడిగితే.. వారి ముఖంలోనూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. మరి ప్రభాస్ నెక్స్ట్ మూవీ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ పేరును ఎందుకు అంత గొప్యాంగా ఉంచుతున్నారు అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. లేకపోతే సాహో మూవీ విషయంలో చేసినట్లుగానే నిర్మాతలు ఇప్పుడు కూడా అలాంటి తప్పు చేస్తున్నారా అనే టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి కనీసం ఫస్ట్ లుక్ తో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది తెలుస్తుంది లేదా అనేది.