మెగా స్టార్ చిరంజీవి నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుసగా కమర్షియల్ హిట్స్ తో దూసుకు పోతున్న సమయంలో చరణ్ అత్యుత్సాహంతో చేసిన ఒకే ఒక్క ప్రయోగం బెడిసి కొట్టడంతో చరణ్ కెరియర్ ను ఒక కుదుపు కుదిపింది. అదే చరణ్ ఏరి కోరి ముచ్చట పడిచేసిన బాలీవుడ్ ప్రయోగం ‘జంజీర్’. తెలుగులో వస్తున్న విజయాలతో సంతృప్తి చెందక అనవసరంగా ఒక హిందీ చిత్రం చేసి అపఖ్యాతిని పొందాడు.
తనకి సూట్ కాని పాత్రలో చరణ్ మెప్పించలేకపోయాడు. చరణ్ చేసిన ఆ జంజీర్ అనే పీడ కల మాత్రం అతడిని విడిచి పెట్టడం లేదు. ఇప్పటికీ వెంటాడుతూ అతని మనశ్శాంతి లేకుండా చేస్తోంది అనే విషయానికి ఉదాహరణగా సంఘటన జరిగింది. హాలీవుడ్‌లో వరస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన వారికి గోల్డెన్ రాస్ప్‌బెర్రీ అవార్డులని ఇస్తుంటారు.
అలాగే బాలీవుడ్‌లో గోల్డెన్ కేలా అవార్డులని అతి చెత్త పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన వారికి, అతి చెత్త చిత్రాలు తీసిన వారికి ఇస్తుంటారు. రామ్ చరణ్‌కి ఈసారి గోల్డెన్ కేలా అవార్డులలో రెండు నామినేషన్లు దక్కాయి. వరస్ట్ డెబ్యూ, వరస్ట్ యాక్టర్ రెండు కేటగిరీల్లోను చరణ్ నామినేట్ అయ్యాడు. జంజీర్ సినిమా చేసిన గాయం ఇలా చరణ్‌ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఆనందించదగ్గ విషయం ఏమిటంటే ఈ నామినేషన్స్‌లో బాలీవుడ్‌లోని ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కూడా చోటు దక్కించుకున్నారు.
అజయ్‌దేవ్‌గణ్, ఇమ్రాన్ ఖాన్, రణ్‌వీర్‌సింగ్ లాంటి వాళ్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు కాబట్టి చరణ్ మరీ అంత బాధ పడనక్కర్లలేదేమో అని అనుకోవాలి. ఈ అనుభవాల రీత్యా చరణ్ భవిష్యత్ లో బాలీవుడ్ సినిమాలలో నటించేడప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటాడనే ఆశిద్దాం.
మరింత సమాచారం తెలుసుకోండి: