పెళ్లైన వారితో సంబంధం పెట్టుకుంటే.. బతుకంతా నరకమే.. నేను ఆ బాధపడ్డాను.. నటి ఆవేదన!
ఈ మద్య దేశ వ్యాప్తంగా డేటింగ్ కల్చర్ పెరిగిపోతుంది. ఒకప్పుడు పాశ్చాత్య నాగరికత అయిన డేటింగ్.. ఇప్పుడు భారత దేశంలో కూడా పాకింది. అయితే డేటింగ్ అనేది ఇప్పుటి విషయం కాదు, సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సాగుతుంది. కొంత మంది ఇష్టపడ్డ నటీనటులు కొంత కాలం కలిసి జీవితం కొనసాగించి తర్వాత విడిపోయారు. అయితే ఈ మద్య కొంత మంది పెళ్లైన మగాళ్లతో ఆడవారు.. ఆడవారితో మగవారు సహజీవనం కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో వారి మద్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో చంపుకునే వరకు వెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లైన మగవాడి జోలికి వెళ్లొద్దు.. అలా వేళితే బతుకు బండలే.. నరకం అని అంటుంది ప్రముఖ నటి నీనా గుప్త.
తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, వాటి ద్వారా తాను నేర్చుకున్న గుణపాఠాలను అభిమానులతో ఆమె పంచుకున్నారు. జీవితంలో ఏ తోడు లేకపోయినా ఒంటరిగా బతకొచ్చని... కానీ, పెళ్లైన వ్యక్తితో సంబంధం మాత్రం పెట్టుకోవద్దని ఆమె సూచించారు. ప్రముఖ క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్‌తో ప్రేమలో పడిన నీనా ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేశారు. వారిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న సమయంలో వెస్టిండీస్ కెప్టెన్, డాషింగ్ క్రికెటర్ వివియన్ రిచ్చర్డ్స్‌తో ప్రేమలో పడ్డింది. ఆ తర్వాత వారిద్దరి సహజీవనం చేశారు. ఆ క్రమంలో మసాబా గుప్తా అనే కూతురు జన్మించింది.
పెళ్లైన వ్యక్తి తొలుత తన భార్య అంటే ఇష్టం లేదంటాడని, త్వరలోనే విడాకులు తీసుకుంటానని నమ్మిస్తాడని నీనా గుప్తా తెలిపారు. అతని మాటలు నిజమే అని సర్వస్వం అప్పజెప్పేస్తారు. పూర్తిగా నమ్మిన తర్వాత ఆ వ్యక్తిని రహస్యంగా కలవడం.. పెద్దలకు తెలియకుండా మేనేజ్ చేయడం.. ఇలా రోజులు గడిచిపోతుంటాయి. తీరా పెళ్లి ప్రస్తావన తెస్తే చిన్నగా జారుకుంటారు. తన జీవితంలో కూడా ఇదే జరిగిందని... ఎంతో ఆవేదనను అనుభవించానని తెలిపారు. అందుకే అందరికీ చెబుతున్నానని... పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడొద్దని హెచ్చరిస్తున్నానని చెప్పారు.