హిట్ : నాని ఇలా కూడా హిట్ కొట్టేశాడే... ?
ఇక నాని తన అభిరుచి మేరకు నిర్మాతగా మారి కూడా మంచి కథాంశంతో ఉన్న సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల అ సినిమాతో ఉత్తమ నిర్మాత అవార్డు గెలుచుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా నానికి నిర్మాతగా మంచి పేరు తీసుకు వచ్చింది. అటు విమర్శకుల ప్రశంసలు సైతం ఆ సినిమాకు వచ్చాయి. ఇక తాజాగా నాని తన శిష్యుడు విశ్వక్సేన్ను హీరోగా పెట్టి హిట్ సినిమా తీశాడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సైతం మంచి కథ, కథనాలతో తెరకెక్కిందన్న ప్రశంసలు వస్తున్నాయి.
ఇక హిట్ సినిమా నాని పెట్టిన పెట్టుబడితో పోల్చితే మంచి లాభాలు కూడా తెస్తుందని అంటున్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన హిట్ యూత్‌తో పాటు కొన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని.. ముఖ్యంగా ఏ సెంటర్లతో పాటు మల్టీ ఫ్లెక్స్‌లలో బాగా ఆడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు కెప్టెన్ అయిన శైలేష్ కొలను డిపార్ట్ మెంట్స్ నుంచి బెస్ట్ తీసుకోవడంలో, ఆర్టిస్టుల నుండి బెటర్ పెర్ఫార్మన్స్ తీసుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఏదేమైనా నాని అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగా కూడా హిట్ కొట్టేస్తున్నాడు. నిన్న అ సినిమా నేడు హిట్ సినిమాతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.